షియత్సు పద్ధతితో ఒత్తిడి దూరం..


Tue,August 14, 2018 10:39 PM

టెన్షన్..టెన్షన్..టెన్షన్..దైనందిన జీవనంలో ఒత్తిడి లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, పెద్ద, యువత, మహిళలు అనే తేడా లేకుండా..నేడు అందరూ ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. ఒత్తిడి వల్ల మరిన్ని అనర్థాలు కొని తెచ్చుకున్నట్లే..
టెన్షన్ పడడం వల్ల శక్తి కోల్పోవడమేకాకుండా లేనిపోని రోగాల బారిన పడాల్సి వస్తుంది. తాత్కాలిక ఉపశమనాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌తోపాటు పలురకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి జపాన్‌లో షియత్సు స్వీయ మర్దన పద్ధతుల ద్వారా శరీరం ఉపశమనం పొందడమేకాకుండా, నొప్పులు కూడా తగ్గుతున్నాయట.

పియత్సు అనేది జపనీస్‌కు చెందిన ఒక రకమైన శరీర ఉపశమన పద్ధతి. శరీరంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల వద్ద చేతి వేళ్లతో సాగతీయడం, తట్టడం లేదా నొక్కడం ద్వారా శరీరానికి హాయిని కల్పించడమేకాకుండా, ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చట.ఈ పద్ధతి ప్రకారం కణతలపై మృదువుగా ఒత్తిడిని పెట్టి, ధీర్ఘశ్వాస తీసుకుంటూ, బొటన వేళ్లను వలయాకారంలో కదిలిస్తూ, 5 నుంచి 10 నిమిషాల పాటు మర్దన చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల టెన్షన్ నుంచి బయట పడొచ్చట. అంతేకాదు, పార్శపు తల నొప్పి కూడా మటు మాయం అవుతుందట.

3113

More News

VIRAL NEWS