అధిక బరువు, మధుమేహం సమస్యలను తగ్గించే 'కొర్రలు'..!


Mon,February 1, 2016 01:15 PM

శరీరానికి ఎంతో మేలు చేసే 'కొర్రల'కు తృణ ధాన్యాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు జొన్నలు, సజ్జలు, రాగుల లాగే వీటిని ఎక్కువగా తినేవారు, కానీ కాలక్రమేణా వీటి వాడకం ఇప్పుడు తక్కువైంది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ధాన్యపు ఆహారంలో కొర్రలు 6వ స్థానంలో ఉన్నాయి.

భారత్, చైనా, నైజీరియాల్లో వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. కొర్రలు చాలా తక్కువ కాలంలోనే పక్వానికి వస్తాయి. మన దేశంతోపాటు ప్రధానంగా చైనా, జపాన్, రష్యా, ఆఫ్రికా, ఈజిప్ట్ దేశాల్లో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. పోషక పదార్థాలు అధికంగా ఉండే కొర్రలను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్యకర ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. తృణ ధాన్యాలన్నింటిలోనూ సులభంగా జీర్ణమయ్యే ఆహారంలో కొర్రలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.

2. పెద్దపేగును ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు మలబద్దకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి.

3. గోధుమలు, వరి అన్నం కన్నా చాలా తక్కువ మొత్తంలో తీపిని కొర్రలు కలిగి ఉంటాయి. దీంతో ఇవి మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
foxtail-millets
4. బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా కొర్రలను తీసుకోవచ్చు, దీని వల్ల ఎటువంటి కొవ్వు శరీరంలో చేరదు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మెటబాలిజం ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.

5. మానసిక వ్యాధులు, టెన్షన్, ఒత్తిడి తదితర సమస్యలతో సతమతమయ్యేవారికి సెరటోనిన్ అధికంగా అవసరమవుతుంది. అలాంటి సెరటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు కొర్రలు ఉపయోగపడతాయి.

6. వీటిలో ఉండే మెగ్నిషియం మైగ్రేన్ తలనొప్పులు, హార్ట్ ఎటాక్‌లు, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నియాసిన్ (విటమిన్ బి3) చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలతోపాటు ప్రోటీన్లు కూడా కొర్రల్లో ఎక్కువగానే ఉన్నాయి.

7. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగిస్తుంది. ప్రధానంగా మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.

అన్నం, ఆలుగడ్డలకు బదులుగా కొర్రలను తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. డైరెక్ట్‌గా తినలేని వారు సలాడ్ రూపంలోనూ, కూరగాయలతో ఉడికించి కూడా దీన్ని తీసుకోవచ్చు. కొర్ర అన్నం వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారు 3 రెట్ల నీరు పోసి ఉడికించాలి. అన్నం రూపంలోనే కాకుండా పిండి, రవ్వగా చేసుకుని వాటితో ఉప్మా, దోశ, ఇడ్లీ, సంకటి, కిచిడీ, పాయసం, రొట్టె ఇలా ఏది కావాలంటే అది చేసుకుని తినవచ్చు.

15426

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles