ఫ్యాటీ లివ‌ర్ ఉందా..? ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

Fri,February 15, 2019 03:02 PM

లివ‌ర్‌లో కొవ్వు ప‌దార్థాలు బాగా పేరుకుపోతే వ‌చ్చే అనారోగ్య స్థితిని ఫ్యాటీ లివ‌ర్ అంటారు. ఇది రెండు ర‌కాలు. నాన్ ఆల్క‌హాలిక్‌, ఆల్క‌హాలిక్‌. నాన్ ఆల్క‌హాలిక్ అంటే.. ఆల్క‌హాల్ తీసుకోకుండానే వ‌చ్చే ఫ్యాటీ లివ‌ర్‌. ఇక ఆల్క‌హాల్ బాగా తీసుకునేవారికి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ వ్యాధి వ‌స్తుంది. అయితే ఈ రెండింటిలో ఏ త‌ర‌హా వ్యాధి వ‌చ్చినా ప్ర‌మాదమే. దాంతో దీర్ఘకాలంలో లివర్ చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అలాంటి ప్ర‌మాదం రాకుండా ఉండాలంటే ముందుగానే జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్ వద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవ‌డంతోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే...


1. వాల్‌న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. లివ‌ర్‌లో ఉండే కొవ్వు ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి.

2. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటుంటే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

3. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే ఎన్నో పోష‌కాలు బ్రొకొలిలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకుంటే లివ‌ర్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉండే చేప‌లు, అవిసె గింజ‌లు, న‌ట్స్‌ను త‌ర‌చూ తింటుంటే ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

5. అవ‌కాడోలను ఆహారంలో భాగం చేసుకున్నా ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఫ్యాటీ లివ‌ర్ స‌మస్య ఉన్న‌వారు ఆల్క‌హాల్ సేవించ‌రాదు. చ‌క్కెర‌, వేపుడు ప‌దార్థాలు, రిఫైన్డ్ నూనెలు, ప‌దార్థాలు, శాచురేటెడ్ కొవ్వుల‌ను తీసుకోరాదు.

6548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles