శుక్రవారం 05 మార్చి 2021
Health - Jan 16, 2021 , 20:58:52

మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?

మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?

మనం తినే ఆహారంలో ఫైబర్ క‌చ్చితంగా ఉండాల‌ని  చెబుతున్నారు ఆరోగ్య  నిపుణులు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార ప‌దార్థాలు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాక.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎందుకంటే ఫైబర్ కలిగిన  ప‌దార్థాలు తింటే ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఫైబర్ తక్కువ తినే వారితో పోలిస్తే  ఎక్కువ తినే వారిలో డిప్రెషన్ లెవెల్ తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయని తాజాగా చేసిన స్టడీలు కొన్ని చెబుతున్నాయి.

ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినేవారిలో   తక్కువ డిప్రెషన్ స్థాయిలు కనిపిస్తున్నాయట. గతంలో చేసిన అధ్య‌య‌నాల్లో    ఫైబర్ కలిగిన ఆహారాలను చేర్చుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉండటమే కాక, హానికరమైన మైక్రోబైయోటాకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిసింది. అలాగే బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడి న్యూరో  ట్రాన్స్‌మిష‌న్   అవకుండా ఉంచే శక్తి ఫైబర్  ఫుడ్‌ల‌లో ఉంటుందని తేలింది. అంతేకాదు.. ఫైబర్ ఎక్కువగా లభించే పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తినడం వల్ల ఆరోగ్యానికి రకరకాల లాభాలున్నాయట. ముఖ్యంగా గుండె సమస్యలు, డయాబెటీస్, రొమ్ము క్యాన్సర్ లాంటి భయంకరమైన సమస్యల నుంచి బయటడచ్చని కూడా స్టడీలు చెబుతున్నాయి. 

నిజానికి ఫైబర్ ఎక్కువ తినడం వల్ల మహిళల్లో సంతానలేమి సమస్య తగ్గుతుంది. ఇది నెలసరి సమస్యలను దూరం చేయడమే కాక, ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెంచి సంతానోత్పత్తికి సహాయపడుతుంది.  మరోవైపు ఆహారం తీసుకునే పదార్థాల్లో ఉండే ఫైబర్ మన మూడ్‌ను మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ వంటి సమస్యల నుంచి బయటపడొచ్చని కొరియా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ ఎగ్జామినేషన్ సర్వే 2014, 2016, 2018లలో స్పష్టం చేసింది. 

ఈ ఒక్క స్టడీ మాత్రమే మహిళల్లో నెలసరి ముందు , నెలసరి తర్వాత ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే మార్పుల గురించి చెప్పింది. మొత్తం 5వేల 807మంది మహిళలపై ఈ స్టడీ నిర్వహించారు. అందులో దాదాపు 47ఏళ్లున్న మధ్య వయస్కులలో నెలసరి ముందు 2వేల 949 మందికి నెలసరి తర్వాత 2వేల 858మంది డేటా సేకరించారు. ఫైబర్ తిన్న పార్టిసిపెంట్స్ ను 24గంటల ముందు ఏం తిన్నారో గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. 

డిప్రెషన్ ఉన్న వారు సరిగా నిద్రపోలేకపోవడం, మూడ్ మారిపోతుండటం, ఎనర్జీ లెవల్స్ తగ్గిపోవడం పనిచేసేందుకు చురుకుదనం లేకపోవడం వంటి లక్షాణాలతో ఉంటారు. ఇటువంటి లక్షణాలన్నీ ఫైబర్ ఎక్కువగా తీసుకునే వారిలో చాలా అరుదుగా మాత్రమే కనిపించాయి. నెలసరి ముందు తర్వాతలో వారు పడే సమస్య కూడా తక్కువగానే కనిపించింది.

VIDEOS

logo