మెటబాలిజం పెరిగి బరువు తగ్గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Thu,December 26, 2019 01:42 PM

మన శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేయాలంటే.. శరీర మెటబాలిజం పెరగాలన్న సంగతి తెలిసిందే. దీంతో మనం తినే ఆహారం త్వరగా జీర్ణమై ఆ తరువాత వచ్చే శక్తి క్యాలరీల రూపంలో త్వరగా ఖర్చవుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అయితే మెటబాలిజం పెరగాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద తెలిపిన ఆహారాలను తీసుకోవాలి. దీంతో అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే...


* ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్లను జీర్ణం చేయడం కోసం శరీరం ఎక్కువగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అలాగే ప్రోటీన్ల వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

* నిత్యం 2 లేదా 3 కప్పుల కాఫీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాఫీ తాగడం వల్ల శరీర మెబటాలిజం పెరిగి క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు కూడా తగ్గుతారు.

* ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా మెటబాలిజంను పెంచుకోవచ్చు.

* యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ బరువు తగ్గించడంలోనే కాక మెటబాలిజం పెరిగేందుకు కూడా సహాయ పడుతుంది. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్‌ నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కలుపుకుని తాగితే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చయి బరువు తగ్గుతారు.

* గోరు వెచ్చని నీటిని నిత్యం తాగడం వల్ల కూడా శరీర మెటబాలిజం పెరుగుతుంది. రోజూ సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగితే నెలకు 1 నుంచి 2 కిలోల వరకు బరువు తగ్గవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

6223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles