అల్సర్లకు చెక్ పెట్టే ఆహారాలు..!


Tue,September 11, 2018 06:22 PM

సాధారణంగా మనకు జీర్ణాశయం లేదా పేగుల్లో అల్సర్లు ఏర్పడుతాయి. ఆయా భాగాల్లో ఉండే మ్యూకస్ పొరకు నష్టం కలిగినప్పుడు ఆ పొర పరిమాణం తగ్గుతుంది. దీన్నే అల్సర్ అంటారు. అయితే అల్సర్లు రాకుండా చూసుకోవాలన్నా, వచ్చిన అల్సర్ల నుంచి ఉపశమనం పొందాలన్నా అందుకు మనకు పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్సర్ల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తాయి. హెచ్.పైలోరీ బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీనివల్ల పేగులు, జీర్ణాశయంలో ఉండే అల్సర్లు తగ్గుతాయి.

2. క్యారెట్, కాలిఫ్లవర్, కేల్, అస్పారగస్, బ్రకొలి, ఎరుపు, ఆకుపచ్చని క్యాప్సికం, యాపిల్స్, ద్రాక్షలు, యాప్రికాట్స్, కివీలు తదితర పండ్లను ఎక్కువగా తింటుంటే అల్సర్లు తగ్గిపోతాయి.

3. నిత్యం ఆహారంలో పెరుగును భాగంగా చేసుకుంటే అల్సర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

4. తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. తేనెను నిత్యం తీసుకోవడం వల్ల అల్సర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

4134

More News

VIRAL NEWS