మహిళల్లో రక్తహీనతకు పరిష్కారాలు..!


Thu,November 15, 2018 03:09 PM

ఇంటి పని.. ఆఫీసుకు వెళ్తే అక్కడా పని.. దీంతో మహిళలకు తీరిక లేకుండా పోతున్నది. ఈ క్రమంలో నిత్యం అధికంగా ఒత్తిడికి గురయ్యే మహిళల్లో రక్తహీనత కూడా ఎక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంట్లో పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని వారు చూస్తున్నారు కానీ తమ ఆరోగ్యం గురించి వారు పట్టించుకోవడం లేదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహిళలు తమకు వచ్చే రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే కింద సూచించిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. అవేమిటంటే...

1. బొప్పాయి పండు హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. బొప్పాయి పండు జ్యూస్ లేదా పండును రోజూ తీసుకుంటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య పోతుంది.

2. దానిమ్మ పండు వల్ల రక్తం ఎక్కువగా తయారవడమే కాదు... శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

3. బీట్‌రూట్‌ను జ్యూస్ రూపంలో నిత్యం తీసుకుంటే కొద్ది రోజులకే రక్తం బాగా తయారై రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

4. క్యారెట్లు, యాపిల్, టమాటాలు, ఖర్జూరాలు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటుంటే మహిళలు తమకు వచ్చే రక్తహీనత సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.

1343

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles