నేడు వరల్డ్ ఒబెసిటీ డే.. హై ప్రొటీన్ డైట్‌తో అధిక బరువుకు చెక్..!


Thu,October 11, 2018 12:50 PM

నేటి తరుణంలో అధిక శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే అధిక బరువు ఉన్నవారిని చూసి కొందరు ఎగతాళి చేస్తారు. కానీ ఇలా ఎగతాళి చేయడం తగదు. బరువు తగ్గేందుకు అవసరమైన సహాయం చేయాలి. అంతేకానీ బరువు అధికంగా ఉన్నారని ఏడిపించకూడదు. అయితే అధికంగా బరువు ఉన్నవారి పట్ల ఇలా వివక్షను చూపించకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా అక్టోబర్ 11వ తేదీన వరల్డ్ ఒబెసిటీ డేను నిర్వహిస్తున్నారు. 2015లో ఈ డేను నిర్వహించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అధిక బరువు తగ్గేందుకు హై ప్రోటీన్ డైట్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తోఫు
సోయా మిల్క్‌తో తయారు చేసే తోఫును నిత్యం అరకప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో 8 నుంచి 10 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అలాగే తోఫులో ఉండే అమైనో ఆమ్లాలు, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, పాస్ఫరస్‌లు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.

2. పాల సంబంధ పదార్థాలు
పాలు, పెరుగు తదితర పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిల్లో ఉండే కాల్షియం, ప్రోటీన్లు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.

3. కోడిగుడ్లు
కోడిగుడ్లలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లతోపాటు విటమిన్ బి2, బి6, బి12, డి, సెలీనియం, జింక్, ఐరన్, కాపర్‌లు ఉంటాయి. ఇవి అధిక బరువు తగ్గడంలో మేలు చేస్తాయి.

4. సీఫుడ్
సీఫుడ్‌లో ఫ్యాట్ తక్కువగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా ఫిష్‌లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాక అధిక బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.

5. బీన్స్
నిత్యం అరకప్పు బీన్స్ తీసుకుంటే ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల అధిక బరువు త్వరగా తగ్గవచ్చు.

994

More News

VIRAL NEWS