అల‌స‌ట‌, నీర‌సం త‌గ్గాలంటే..?


Mon,August 13, 2018 09:06 PM

నిత్యం వివిధ సంద‌ర్భాల్లో మ‌నం ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. దీంతోపాటు భోజ‌నం స‌రిగ్గా చేయ‌క‌పోవ‌డం, మాన‌సిక స‌మ‌స్య‌లు, పోష‌కాహార లోపం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి ఎప్పుడూ నీర‌సంగా, అల‌స‌టగా ఉంటుంది. వారు ఏ ప‌ని చేయ‌రు. చేసేందుకు ఉత్సాహాన్ని కూడా ప్ర‌ద‌ర్శించ‌రు. అయితే ఆ సమస్యల్ని తగ్గించుకుని ఉత్సాహంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

మహిళలు ఉదయం పూట మాంసకృత్తులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. తక్కువ తీసుకున్నా పొట్ట త్వరగా నిండుతుంది. ముఖ్యంగా ఇవి కొవ్వు నిల్వ‌ల‌ను కరిగిస్తాయి. వీటితోపాటు ఓట్స్‌, పాలు, నానబెట్టిన బాదంప‌ప్పు త‌దిత‌ర ఆహారాలను తగు మోతాదులో తీసుకోవాలి. వ్యాయామాలు చేసినా చేయకపోయినా ప్రతి మూడు గంటలకోసారి కొద్దికొద్దిగా ఏదో ఒకటి తింటూ ఉండాలి. పండ్లు, కూరగాయల ముక్కలు, మొలకలు.. ఇలా ఏవో ఒకటి తీసుకోవాలి. నిద్రపోవడానికి మూడుగంటల ముందు తినడం ఆపేయాలి. ఇలా రోజూ చేస్తుంటే జీవక్రియ రేటు బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. నీర‌సం, అల‌స‌ట త‌గ్గిపోతాయి.

మసాలా పదార్థాలు, బయట ఆహారం తినడం వల్ల సరిగా అరగదు. జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే పానీయాలు తీసుకోవాలి. ఒక పాత్రలో నీళ్లుపోసి అందులో కీరదోస ముక్కలు, అల్లం తరుగు, నిమ్మరసం పిండాలి. ఈ నీళ్లను రోజంతా తాగుతూ ఉంటే వ్యర్ధాలు బయటకు పోతాయి. దీంతోపాటు అదనంగా మంచినీళ్లూ తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల తేలిగ్గా అనిపిస్తుంది.

ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎక్కువయితే పొట్ట ఉబ్బరం, రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. పెరుగులో ఉప్పు లేకుండా చేసుకోవాలి. దానికి బదులు మిరియాలకి ప్రాధాన్యమివ్వవచ్చు. సాధ్యమైనంత వరకూ నిల్వ‌ పచ్చళ్లు, అప్పడాలు, నూనెలో వేయించిన చిరుతిళ్లను మితంగా తీసుకోవాలి.ఈ సూచ‌న‌లు పాటిస్తే నీర‌సం త‌గ్గిపోయి, ఉల్లాసంగా ఉంటుంది. ప‌నిచేసేందుకు త‌గిన ఉత్సాహం ల‌భిస్తుంది.

8710

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles