మంగళవారం 02 మార్చి 2021
Health - Jan 27, 2021 , 17:35:06

కిడ్నీల ఆరోగ్యానికి ఇవి తినండి చాలు..

కిడ్నీల ఆరోగ్యానికి ఇవి తినండి చాలు..

మ‌నిషి ఎక్కువ కాలం జీవించాలంటే గుండె ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. అంతే ముఖ్యమైన‌వి కిడ్నీలు కూడా. రక్తం నుంచి వ్యర్థాలను తొలగించడంతోపాటు శరీరంలో నీరు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, పాస్ఫరస్ వంటివాటిని సమపాళ్ళుగా ఉంచడంలో విశేషమైన పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలను మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత‌ ఆరోగ్యంగా ఉంటామ‌న్నది ప‌చ్చినిజం. శ‌రీరంలోని రక్తం మొత్తాన్ని క్షణం తీరిక లేకుండా వడపోస్తుండే ఈ కీలక అవయవాలను.. నానాటికి విస్తరిస్తున్న మధుమేహం, హైబీపీ, ఊబకాయం వంటివన్నీ దెబ్బతీస్తుంటాయి. మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. అలాకాకుండా మన వంటింటిలో నిత్యం అందుబాటులో ఉండే ఆహారాలతో మూత్రపిండాలను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం.

నిమ్మకాయ


విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మకాయ.. శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తీసుకోవడం చాలా మంచిది అని గుర్తుంచుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.

క్యాప్సికమ్


క్యాప్సికంలో విటమిన్ సీ కూడా గణనీయమైన స్థాయిలో ఉంటుంది. దాంతోపాటు, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ కూడా లభిస్తాయి. పొటాషియం కూడా కొంత ఉంటుంది. ఇవన్నీ సహజంగా మూత్రపిండాలను శుభ్రపరచడానికి సహాయపడతాయి.

పెరుగు


ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరుగులో కనిపిస్తుంది. ఇది జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మూత్రపిండాలను శుభ్రపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అల్లం


మూత్రపిండాలను శుభ్రపరచడంలో అల్లం వాడకం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అల్లంలో క్లోరిన్, అయోడిన్, విటమిన్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. మూత్రపిండంలో ఉండే వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. అల్లం వాడకంతో దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలను కూడా నివారించవచ్చు.

ద్రాక్ష


మూత్రపిండాలను శుభ్రం చేయడానికి విటమిన్ సీ అధికంగా లభించే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు ద్రాక్షల నుంచి ఎరుపు ద్రాక్ష మూత్రపిండాల ఆరోగ్యానికి మరీ మంచివి. వీటిలో పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఇనుము అధికంగా ఉండి.. వీటిని తినడం వల్ల కడుపు సమస్యలు రావు.

అదేవిధంగా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్లాడర్‌, మూత్రాకోశ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. గుమ్మడి విత్తనాలు, కిడ్నీలకు చాలా మంచి ఆహారం. కిడ్నీకి బలాన్ని ఇవ్వడమే కాక రక్త పుష్టిని కలిగిస్తుంది. అలాగే, నిత్యం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలివ్‌ ఆయిల్‌ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!

మహిళల్లో యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ.. ఎందుకలా..?

మీ కిచెన్‌లో పెయిన్‌ కిల్లర్లు ఉన్నాయ్‌.. గమనించారా?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo