ఈ 5 సూచనలు పాటిస్తే డయాబెటిస్‌ను తేలిగ్గా అదుపులో ఉంచుకోవ‌చ్చు..!


Mon,September 24, 2018 03:51 PM

కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవన విధానం అస్తవ్యస్తంగా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తే జన్యు సంబంధ కారణాల వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఏ తరహా డయాబెటిస్ అయినా సరే కింద సూచించిన విధంగా పలు సూచనలు పాటిస్తే దాన్ని తేలిగ్గా అదుపులో ఉంచుకోవ‌చ్చు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఉదయాన్నే హడావిడిగా ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ముందుగా సీజనల్ ఫ్రూట్ ఒకటి తినాలి. తరువాత నానబెట్టిన బాదంపప్పును గుప్పెడు మోతాదులో తీసుకోవాలి. అనంతరం బ్రేక్‌ఫాస్ట్‌ను మితంగా చేయాలి. దీని వల్ల ఉదయాన్న బ్లడ్ షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

2. ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒకే సమయానికి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక లంచ్ విషయానికి వస్తే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు లంచ్ చేయాలి. అందులో కచ్చితంగా మజ్జిగ తీసుకోవాలి. దీని వల్ల విటమిన్ డి, బి12 స్థాయిలు పెరుగుతాయి. ఇవి డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు పనికొస్తాయి.

3. పల్లీలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్య లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిల్లో అమైనో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. నిత్యం గుప్పెడు మోతాదులో పల్లీలను తినాలి. దీని వల్ల పోషకాలు బాగా అందుతాయి. అవి డయాబెటిస్‌ను తగ్గించేందుకు పనికొస్తాయి.

4. చాలా మంది డయాబెటిస్ పేషెంట్లు షుగర్ ఫ్రీ పొడి కలిపిన కాఫీ, టీలను తాగుతారు. నిజానికి షుటర్ ఫ్రీ పొడి మన శరీరానికి మంచిది కాదు. మరి తీపి తగలాలంటే ఎలా అంటే.. కాఫీ లేదా టీలో 1 టీస్పూన్ వరకు చక్కెర కలుపుకుని తాగండి. ఏం ఫర్వాలేదు. దీని వల్ల షుగర్ లెవల్స్ అంతగా ఏమీ పెరగవు. కాకపోతే కాఫీ, టీలను రోజుకు 2, 3 కప్పుల వరకు మాత్రమే పరిమితం చేయండి. అంతకు మించి తాగకుండా చూసుకోండి.

5. వారానికి కనీసం 5 రోజులు, రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. కనీసం వాకింగ్ చేసినా చాలు.. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే వారంలో 2 సార్లు వెయింట్ ట్రెయినింగ్ తీసుకోవాలి. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.

4488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles