గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Jan 28, 2020 , 23:54:08

నెలసరికి సరైన మార్గాలు!

నెలసరికి సరైన మార్గాలు!

కొంతమందికి నెలసరి పెద్ద సమస్య. ఒక్కోసారి వారం పదిరోజులు ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు రెండు, మూడ్రోజుల ముందే వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్‌గా పీరియడ్స్‌ రావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు.

  • కప్పు నీటిలో తాజా అల్లం ముక్కను వేసి బాగా మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత దీన్ని వడకట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాస్తంత తేనె కలిపి దీన్ని ప్రతి రోజూ భోజనం తర్వాత తాగాలి. దీనివల్ల పీరియడ్స్‌ సమయానికి వస్తాయి.
  • రుతు సమస్యలను సరిచేసే గుణం సోంపులో ఉంటుంది. రెండు టీ స్పూన్ల సోంపును తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆనీటిని వడబోసి తాగాలి. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
  • దాల్చిన చెక్కని పొడి చేసుకోవాలి. ఈ పౌడర్‌ను గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. అంతే కాకుండా రోజూ తీసుకునే ఆహారంలో ఈ పొడిని చల్లుకొని తినవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పీరియడ్స్‌ రెగ్యులర్‌గా అవుతాయి.
  • హార్మోన్ల మార్పులవల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో రుతుక్రమం ఆగిపోతుంది. పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకుంటే మంచిది. క్యారెట్‌, ద్రాక్ష వంటివి జ్యూస్‌గా తీసుకుంటే రుతు సమస్యలు దూరమవుతాయి.
  • మహిళల్లో ఒత్తిడి కారణంగా కూడా రుతుక్రమ సమస్యలు ఏర్పడతాయి. ప్రతి రోజూ ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్‌గా ఉంటాయి. దీనివల్ల రుతుక్రమ సమస్య తగ్గుతుంది.


logo