'బరువు' తగ్గించే పౌష్టికాహారం 'రాగులు'...


Mon,December 7, 2015 04:15 PM

ప్రపంచంలోని అధిక శాతం మంది ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో 'రాగులు' ఒకటి. దీన్ని తీసుకోవడం వల్ల శక్తితోపాటు ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1. రాగుల్లోని ట్రిప్టోన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి అదనంగా శరీరంలోని కేలరీలు పోగవ్వకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు పదార్థాలు కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువగా తినకుండా చేస్తాయి. దీంతో అధిక బరువు సులభంగా తగ్గుతుంది.

2. వీటిలో క్యాల్షియం దండిగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్య ఉండడానికి తోడ్పడుతాయి.

3. రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజ్ త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నియంత్రణ ఉండేందుకు రాగులు తోడ్పడుతాయి.

4. వీటిల్లో ఉండే ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడుతుంది.

5. రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణ లోపం నుంచి దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు, త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.

7702

More News

VIRAL NEWS