శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 27, 2020 , 23:42:02

మెంతులతో మేలెంతో..!

మెంతులతో మేలెంతో..!

హైదరాబాద్: మెంతులు.. ఈ పేరు తెలియని వారుండరు. రుచి చూడనివారుండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పులు, పులుసులు, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో క్రమం తప్పకుండా వాడుతూ ఉంటారు. మెంతులు పసుపు రంగులో ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. మెంతులను వేయించినప్పుడు ఇంకా చక్కని సువాసన వస్తుంది. అయితే మెంతులు చేదుగా ఉంటాయి. అందువల్ల వంటకాలలో తక్కువ మోతాదులో వాడతారు.

మెంతులను ఇంగ్లీష్ లో ‘ఫెన్యుగ్రీక్’ అనీ, హిందీలో ‘మేథీ’ అని పిలుస్తుంటారు.

వీటితో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌-సీ, బీ1, బీ2, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. 

1. డయాబెటిస్ లేదా మధుమేహాన్ని అదుపు చేస్తుంది.

2. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

3. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది

4. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులకు చక్కని ఔషధం

5. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులను తగ్గిస్తుంది

6. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది

7. క్యాన్సర్ ను నివారిస్తుంది

8. పాలిచ్చే తల్లులలో పాల సామర్ధ్యాన్నిపెంచుతాయి

9. బరువు తగ్గించడానికి సహాయపడతాయి

10. రక్తపోటును క్రమపరుస్తాయి

11. మూత్రపిండాల (కిడ్నీల) పనితీరును మెరుగు పరుస్తుంది

12. కాలేయాన్ని కాపాడటానికి తోడ్పడుతుంది.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo