పీరియడ్స్ టైమ్లో తలనొప్పి.. 5 కారణాలు

జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు ఏవని ఏ మహిళను ప్రశ్నించినా పీరియడ్స్ అని టక్కున చెప్పేస్తారు. బాధాకరమైన తిమ్మిర్ల నుంచి మూడ్ స్వింగ్స్ వరకు.. రుతుస్రావం సమయంలో మహిళలు ఎన్నో చికాకు సమస్యలను ఎదుర్కొంటుంటారు. చాలా మంది మహిళలు తమకు తేలికపాటి తలనొప్పి ఉన్నట్లుగా ఫిర్యాదు చేస్తున్నారు!
మీరూ తేలికపాటి తలనొప్పిని ఎదుర్కొంటున్నారా? ఎందుకు అనే విషయం తెలియదా? పీరియడ్స్ టైమ్లో తలనొప్పి రావడం సహజమే అయినా, ఆందోళన చెందాల్సిన విషయం కాదని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. రుతుస్రావం అయినప్పుడు వికారం అనుభవించడానికి కారణాలు చాలా ఉండవచ్చు. కానీ, చాలావరకు శరీరంలో హార్మోన్ల మార్పులకు సంబంధించినవి ఉంటాయని గుర్తుంచుకోవాలి. తేలికపాటి తలనొప్పి రావడానికి గల 5 కారణాలు తెలుసుకుందాం.
తిమ్మిరి
పీరియడ్స్ సమయంలో తిమ్మిరి తేలికపాటి నుంచి తీవ్రమైనదిగా ఉంటుంది. నొప్పి చాలా ఘోరంగా ఉన్నప్పుడు కదలలేరు. దీనిని తేలికగా భావించకుండా వైద్యులను సంప్రదించి తగు సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తహీనత
ఇనుము లోపం కారణంగా శరీరం ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రక్తహీనతకు దోహదం చేస్తుంది.
మైగ్రేన్
సుమారు 60 శాతం మంది మహిళలు తమ పీరియడ్స్ టైమ్లో మైగ్రేన్ బారిన పడుతున్నట్లు తేలింది. దీనికి కారణం హార్మోన్లు . ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ హెచ్చుతగ్గుల స్థాయిలు మైగ్రేన్ దాడిని ప్రేరేపిస్తాయి.
ప్రీమెన్స్ట్రల్ డైస్పోరిక్ డిజార్డర్
పీఎండీడీ కారణంగా కూడా తేలికపాటి తలనొప్పి వస్తుందని నిపుణులు గుర్తించారు. ఈ సమస్య నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించి తగు సలహా పొందాలి.
లోబీపీ
వికారం రావడానికి గల కారణాలలో లో బ్లడ్ ప్రెషర్ కూడా ఒకటి. పీరియడ్స్ సమయంలో రక్తపోటు గణనీయంగా పడిపోతుంది. హార్మోన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, సెక్స్ హార్మోన్లు రక్తపోటును నియంత్రించడం వలన కూడా తేలికపాటి తలనొప్పి లేదా వికారానికి దారితీస్తుందని తేలింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.