గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - May 12, 2020 , 12:39:50

భారత్‌లో కోవిడ్-19 రోగులపై ఫావినాపివిర్ పరీక్షలు ప్రారంభం

భారత్‌లో కోవిడ్-19 రోగులపై ఫావినాపివిర్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్: కరోనా చికిత్సకు ఉపకరిస్తుందని భావిస్తున్న యాంటీవైరల్ ఔషధం ఫావీపిరావిర్ పరీక్షలు మొదలుపెట్టినట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ మంగళవారం ప్రకటించింది. ఆస్పత్రులలో చికిత్స పొందుతచున్న రోగులపై దీని ప్రభావం అంచనా వేస్తారు. ఈ మందుకు గత ఏప్రిల్ నెలలోనే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. కోవిడ్-19 రోగులపై పరీక్షలకు మొట్టమొదట అనుమతి పొందినది తమ కంపెనీయేనని గ్లెన్‌మార్క్ బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. పదికి పైగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే జూలై లేదా ఆగస్తు నాటికి ఈ పరీక్షల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. కోిడ్-19 రోగులపై ఫావిపిరావిర్ ప్రభావం గురించి తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఆతృతతో ఎదురుచూస్తున్నారని, ప్రస్తుతం కరోనాకు చికిత్స అంటూ ఏదీ లేదు కనుక అధ్యయన ఫలితాలు కీలకం అవుతాయని గ్లెన్‌మార్క్ వైస్ ప్రెసిడెంట్, క్లినికల్ అభివృద్ధి విభాగం అధిపతి డాక్టర్ మోనికా టాండన్ అన్నారు. కోవిడ్-19 చికిత్స విషయంలో ఈ అద్యయనం తర్వాత ఒక స్పష్టత వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌కు చెందిన ఫ్యూజీఫిల్మ్ టొయామా కంపెనీ ఈ మందును అవిగాన్ అనే బ్రాండ్‌నేమ్‌తో తయారు చేసింది. 2014లో ఫ్లూ జ్వరం చికిత్సకు జపాన్ ప్రభుత్వం అవిగాన్‌కు ఆమోదం తెలిపింది.


logo