సోమవారం 06 జూలై 2020
Health - May 09, 2020 , 20:14:42

రాత్రిపూట నిద్ర‌ప‌ట్ట‌డం లేదా.. ఉప‌వాసం ఉండండి!

రాత్రిపూట నిద్ర‌ప‌ట్ట‌డం లేదా.. ఉప‌వాసం ఉండండి!

పిల్ల‌లు ఎప్పుడైనా రాత్ర‌లు అన్నం తిన‌కుండా అలిగి ప‌డుకుంటే చాలు .. కాస్త అన్నం తిను లేదా పాలు అయినా తాగు బంగారం లేందంటే అర్థ‌రాత్రి ఆక‌లేస్తుంది అని త‌ల్లిదండ్రులు చిన్న‌ప్ప‌టి నుంచే పాట పాడుతుంటారు. ఇది నిజ‌మే అన్న భ్ర‌మ‌లో ఉండిపోతారు. నిజం చెప్పాలంటే రాత్ర‌లు నిద్ర‌ప‌ట్ట‌న‌ప్పుడు ఉప‌వాసం ఉంటే మంచిద‌ని న్యూయార్క్ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. రాత్రిపూట చేసే ఉపవాసంతో మంచి నిద్ర వస్తుందని, ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. అంతేకాదు నిద్రపోతున్నప్పుడు పెద్ద వారిలో దాదాపు 500 కేలరీలు ఖర్చవుతాయట‌.

21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 44 మందిని పరిశోధ‌న‌కు తీసుకున్నారు శాస్త్ర‌వేత్త‌లు. వీరికి కొంత‌కాలం క‌డుపునిండా ఆహారం, పానీయాలు ఇచ్చారు. కొన్నిరోజుల త‌ర్వాత నీరు మాత్ర‌మే ఇచ్చారు. ఆయా స‌మ‌యాల్లో వారు ఎలా నిద్ర‌పోతున్నారో అన్న విష‌యాన్ని గ‌మ‌నించారు. కడుపునిండా తిన్నప్పటితో పోలిస్తే, ఆహారం తీసుకోనప్పుడే బాగా నిద్ర పట్టినట్టు తేలిందన్నారు. రాత్రులు త‌క్క‌వ‌గా తిన‌డం మంచిది. లేదంటే నిద్ర‌లేమితో స‌మ‌స్య‌లు కొనితెచ్చుకుంటారు. నిద్ర‌ప‌ట్ట‌డానికి ప‌రిష్కారం కూడా తెలిసింది. logo