ఎండల్లో కళ్లను కాపాడుకోండి ఇలా..


Mon,March 19, 2018 11:03 PM

ఎండా కాలం ఎండలో తిరుగే వారు చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు కానీ కళ్ల గురించి పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. కానీ ఎండల్లో కళ్ల గురించి జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఎండా కాలంలో ధరించే సన్ గ్లాసెస్ ముదురు రంగులవి ఎంచుకోవాలి. అంతేకాదు యూవీ ప్రొటెక్షన్ కలిగినవైతే మరింత మంచిది. ఇది ఫ్యాషన్, అందంతో పాటు కంటికి రక్షణ కూడా ఇస్తాయి.
* కంటికి నేరుగా ఎండ తగలకుండా హ్యాట్ ధరించడం కూడా మంచిదే.
* నీళ్లు ఎక్కువగా తాగి శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
* ఎండాకాలంలో ఈత కొలనుల్లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు చాలా మంది. అయితే స్విమ్మింగ్ ఫూల్‌లలోని నీటి శుద్ధికి క్లోరిన్ ఉపయోగిస్తారు. ఇది కళ్లకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి స్విమ్మింగ్‌ను ఎంజాయ్ చేసే వారు తప్పనిసరిగా గాగూల్స్ ధరించాలి.
* ఎండాకాలం గాలి చాలా పొడిగా ఉంటుంది. అంతేకాదు పొడిగాలిలో ఎక్కువ అలర్జన్స్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. త్వరగా కళ్లకు సంబంధించిన అలర్జీకి గురయ్యే వారు జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎండిపోయినట్టుగా అనిపించినా, ఎర్రగా మారినా, మరేరకమైన ఇబ్బందిగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
* విపరీతమైన వేడి వల్ల కళ్లు మంటలుగా అనిపించవచ్చు. ఇలాంటి ఇబ్బంది కలిగినపుడు చల్లని నీటితో కళ్లు కడుక్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తీరిక సమయాల్లో చల్లని నీటిలో తడిపిన కాటన్ ప్యాడ్స్, కీరదోసకాయ ముక్కలు కంటి మీద ప్యాడ్స్‌గా ధరించడం ద్వారా కంటికి చల్లదనాన్ని అందించవచ్చు.
* నీళ్లు కంటికి తాకడానికి ముందే కాంటాక్ట్ లెన్స్ తీసేయ్యడం మరచిపోవద్దు.
* భోజనంలో క్యారెట్, బీట్‌రూట్, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే కంటి ఆరోగ్యం బావుంటుంది.
* రోజ్ వాటర్, పాలు వంటి ఏ పదార్థాలు కంటిలో వెయ్యకూడదు.
ఇలాంటి చిన్న జాగ్రత్తలతో ఎండాకాలం కూడా కళ్లను చల్లగా ఉంచుకోవచ్చు.

2931
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles