గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 15, 2020 , 15:06:00

కళ్లు ఎరుపెక్కితే సమస్య ఉన్నట్లే...

కళ్లు ఎరుపెక్కితే సమస్య ఉన్నట్లే...

కోపంతో కళ్లు ఎరుపెక్కడం మామూలే. కాని ఎరుపెక్కిన కళ్లు వాటి లోపలి సమస్యను కూడా సూచిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కంటి పొరల్లో ఉండే రక్తనాళాలు చిట్లినప్పుడు కళ్లు ఎర్రగా మారుతాయి. రక్తనాళాల నుంచి లీక్‌ అయిన రక్తం కంటి పొరల కింద చేరడం వల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తాయి. దీన్ని సబ్‌కంజంక్టివల్‌ హెమరేజ్‌ అంటారు. విడుదలైన రక్తం చాలా తక్కువ పరిమాణంలో ఉండడం వల్ల కంటికి ఎటువంటి ప్రమాదమూ ఉండదు. దృష్టి పైన దీని ప్రభావం ఉండదు. సాధారణంగా రెండు వారాల్లోగా ఎరుపుదనం పోతుంది. అలా కాకుండా ఎక్కువ రోజులు కంటి ఎరుపుదనం తగ్గకపోయినా, దృష్టి సమస్యలు ఎదురైనా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడినప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కళ్లు నలిపినా, తీవ్రమైన దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చాలా ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు ఇలా రక్తనాళాల్లో రక్తం లీక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు చాలా సులభంగా సబ్‌కంజంక్టివల్‌ హెమరేజ్‌కి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే కళ్లపై ఒత్తిడి పడనీయకుండా జాగ్రత్తపడాలి. 


logo
>>>>>>