ఆదివారం 09 ఆగస్టు 2020
Health - Jul 16, 2020 , 19:18:04

లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉంటే మ‌తిమ‌రుపు ఖాయం!

లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉంటే మ‌తిమ‌రుపు ఖాయం!

క‌రోనా కార‌ణంగా దేశ‌మంతా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. రెండు, రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత ఒక్కో రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేస్తూ వ‌చ్చారు. ఎప్పుడూ బిజీగా ఉండే జ‌నాలు లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితమ‌య్యారు. వ‌ళ్లు క‌ద‌ల‌కుండా కంప్యూట‌ర్ ముందు ప‌నిచేస్తుండ‌డంతో బ‌ద్ధ‌కం కూడా ఎక్కువైంది. దీంతో వ్యాయామాలు, యోగాలు కూడా ఆపేశారు. తిన‌డం, కూర్చొ‌ని ప‌నిచేయ‌డం, నిద్ర‌పోవ‌డం.. ఇలానే న‌డుస్తుండ‌డంతో చాలామందిలో ఆనారోగ్య ‌స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు. మ‌ళ్లీ లాక్‌డౌన్ తొల‌గించ‌డంతో ఉరుకులు, ప‌రుగులు అన్న‌ట్లు న‌డుస్తుంది. దీంతో క‌రోనా కేసులు ఎక్కువ‌వ‌డంతో మ‌ర‌లా లాక్‌డౌన్ పెడ‌తారేమో అనుకుంటున్నారు.

మ‌ళ్లీ క‌నుక లాక్‌డౌన్ పెట్టి ఇదివ‌ర‌కులానే ఖాళీగా బ‌ద్ధ‌కంగా ఉంటే అనుకోని రీతిలో అనారోగ్యానికి గుర‌వుతారు అంటున్నారు. ఇంట్లోనే ఖాళీగా ఉండ‌డంతో ఆరోగ్యం క్షీణించి రోగ నిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇది కరోనాకు మేలు చేస్తుంది. అంతేకాకుండా ఊబ‌కాయం, మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌తిరోజూ వ్యాయామం, యోగా, శారీర‌క శ్ర‌మ‌కు కేటాయిస్తే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. మ‌రింకెందుకు ఆలస్యం. డైలీ ఈ ప‌నులు చేసి ఆరోగ్యంగా ఉండండి.logo