శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jun 21, 2020 , 12:59:12

నిద్ర లేక‌పోతే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే.. తెలుసుకోవాల్సిన విష‌యాలు!

నిద్ర లేక‌పోతే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే.. తెలుసుకోవాల్సిన విష‌యాలు!

మనిషికి ఆహారం, నీరు ఎంత అవ‌స‌ర‌మో నిద్ర కూడా అంతే అవ‌స‌రం. తాజా అధ్య‌య‌నంలో తేలిన విష‌యం ఏంటంటే.. ‌స‌రిగా నిద్ర‌పోని వారి ఆయుష్సు త‌గ్గిపోతుంద‌ని తేలింది. ఈ జ‌న‌రేష‌న్‌కు చేతిలో ఫోన్ లేనిదే ఉండ‌లేకున్నారు. టీవీ చూడ‌డం క‌న్నా ఫోన్‌లో సోష‌ల్‌మీడియాలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు. ఫోన్ లైటింగ్ వ‌ల్ల క‌ళ్లు, రేడియేష‌న్ వ‌ల్ల మెద‌డు దెబ్బ‌తింటాయి. ఫోన్ వాడ‌కం ఎక్కువ కావ‌డంతో నిద్ర కూడా త‌క్కువ‌తుంది. వ‌య‌సులో ఉన్న‌వాళ్లు రోజుకు క‌నీసం ఆరు గంట‌లు అయినా నిద్ర‌పోవాలి. చిన్న‌పిల్ల‌లు, వృద్ధులు మాత్రం 10 గంట‌లు నిద్ర‌పోవాలంటున్నారు నిపుణులు. ఇలా చేయ‌కుంటే ఎన్నో స‌మ‌స్య‌లు వెంటాడుతాయి అంటున్నారు. ఇవి ఇవే.. 

నిద్ర‌లేమి వ‌ల్ల క‌లిగే అన‌ర్థాలు :

* తగినంత నిద్రలేకపోతే జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది.

* నిద్రలేకపోతే పనిమీద ఏకాగ్రత ఉండదు.

* స‌రిగా నిద్ర‌పోకపోతే ఊబకాయం, బరువు పెరగటం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

* నిద్రలేమి సమస్య వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయి.

* 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు రోజంతా నీరసంగా, నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేయలేరు, చురుకుదనం లోపిస్తుంది.

* నిద్రలేకపోతే శరీరానికి తగిన ఆక్సిజ‌న్ ల‌భించ‌దు. శరీరానికి ఆక్సిజన్ అందకపోతే ఒత్తిడి, ఆందోళ‌న వంటి సమస్యలు తలెత్తుతాయి.

* విద్యార్థులు తప్పకుండా 7 గంటలు నిద్రపోవాలి. లేకపోతే చదువుకున్నవి ఏవీ గుర్తుండవు.

* శరీరానికి సరిపడా నిద్రలేకపోతే ‘డిప్రెష‌న్’(కుంగుబాటు)కు గురువుతారు.


logo