గురువారం 03 డిసెంబర్ 2020
Health - Nov 21, 2020 , 14:19:02

గుడ్డులో తెల్లసొన మంచిదా.. పచ్చసొన మంచిదా!

గుడ్డులో తెల్లసొన మంచిదా.. పచ్చసొన మంచిదా!

గుడ్లు చాలా విశిష్టమైన ఆహారం. చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుని తినగలిగే ఫుడ్స్‌లో ఎగ్స్ కూడా ఉంటాయి. చాలామంది బ్రేక్ ఫాస్ట్ కోసం, శరీరానికి క్షణాల్లో ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఎగ్స్ తీసుకుంటారు. శరీరానికి న్యూట్రియంట్లు అందించడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో గుడ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. మీకు తెలుసా.. గుడ్డులో ఉండే పచ్చసొనలో ఎక్కువ కొవ్వు శాతం ఉంటుందని.. అందుకే గుడ్డు తినొద్దంటుంటారు. నిజంగా గుడ్డు పచ్చసొన తినకూడదా.. కేవలం గుడ్డులోని తెల్లని భాగం మాత్రమే తినాలా.. రండి తెలుసుకుందాం.

తెల్లసొన(ఎగ్ వైట్)


పచ్చసొనకు చుట్టూ ఉండే దాన్ని ఎగ్ వైట్ అంటాం. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవాళ్లు లేదా ప్రత్యేకమైన డైట్ పాటించేవాళ్లు మాత్రం కచ్చితంగా పచ్చసొన పక్కకు పెట్టేసి ఎగ్ వైట్ మాత్రమే తింటుంటారు. ఎందుకంటే ఎగ్ వైట్ అనేది ఫ్యాట్ ఫ్రీ అన్నమాట, తక్కువ క్యాలరీలు అందించి చెడు కొలస్ట్రాల్‌కు దూరంగా ఉంచుతుంది. ఎగ్ వైట్ అనేది పొటాషియం మినరల్ అందించడంలో ప్రాధాన్యత వహిస్తుంది. అలా చేయడం వల్ల బీపీ లెవల్ సరిగ్గా మెయింటైన్ అవుతుంది. కండలు పెంచాలనుకునేవాళ్లు ఎగ్ వైట్ మాత్రమే తింటుంటారు. హెవీ వర్కౌట్ చేసినప్పుడు కొవ్వు దరిచేరనివ్వకుండా హెల్తీగా ఉంచుతుంది. ఇందులో ఉండే రిబోఫ్లావిన్ విటమిన్ మైగ్రేన్ తలనొప్పి రాకుండా, కళ్ల జబ్బులు రాకుండా కాపాడుతుంది. 

గుడ్డు పచ్చసొన(ఎగ్ యోక్)


గుడ్డు పచ్చసొనలో చాలా మొత్తంలో క్యాలరీలు దొరుకుతాయి. ఒక ఎగ్ వైట్ లో 17 క్యాలరీలు ఉంటే పచ్చసొనలో 55క్యాలరీలు ఉంటాయి. చాలా కారణాలతో పచ్చసొనను దూరం పెడతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువ ఉంటాయని తద్వారా గుండె జబ్బులకు దారి తీస్తుందని సమాచారం. అంతే మొత్తంలో పచ్చసొనలో తెల్ల భాగం కంటే ఎక్కువ న్యూట్రియంట్లు, మినరల్స్ ఉంటాయి. B6, B12, A, D, E, Kవిటమిన్లు ఉండడమే కాకుండా కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, సెలీనియం సమృద్ధిగా దొరకొచ్చు. దీని ద్వారా కంటి చూపు కూడా మెరగవుతుంది. 90శాతం న్యూట్రియంట్లన్నీ పచ్చసొనలోనే ఉంటాయి కేవలం 10శాతం మాత్రమే ఎగ్ వైట్స్ లో దొరుకుతాయి. 

మొత్తానికి.. పచ్చసొనలో ఎక్కువ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. కొలెస్ట్రాల్ లెవల్స్ కు భయపడి దూరంగానే ఉంచుతాం. మీకు ఒకవేళ గుండె సమస్యలు ఏమీ లేకపోతే పచ్చసొనను వదిలేయకండి. లేదా గుండెకు సంబంధించిన సర్జరీలు జరిగినా పచ్చసొన పక్కకుపెట్టాల్సిందే. లేదంటే తినడంలో ఇబ్బంది ఏమీ ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.