శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Sep 17, 2020 , 15:23:58

ఇంటి చిట్కాల‌తోనే అస్త‌మా కంట్రోల్.. లేదంటే క‌రోనా బారిన ప‌డుతారు!

ఇంటి చిట్కాల‌తోనే అస్త‌మా కంట్రోల్.. లేదంటే క‌రోనా బారిన ప‌డుతారు!

అస్త‌మా అంటే ఆయాసం, ఉబ్బ‌సం అని కూడా అంటారు. దీనిని చాలామంది పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్ల‌కి మాత్ర‌మే దీని విలువ తెలుసు. శ్వాస స‌మ‌స్య‌లు బ్రోన్కైటిస్‌, ఉబ్బ‌సం వంటి అనేక ర‌కాల ప‌రిస్థితుల‌కు దారితీస్తాయి. ఉబ్బ‌సం ప్రాణాంతకం. ఇది తీవ్ర‌మైన ఆందోళ‌న‌కు దారితీస్తుంది. అస్త‌మా ఉన్న‌వారికి క‌రోనా మ‌రింత తొందంగా వ‌స్తుంది. అందుకే ఇంటి చిట్కాల‌తో ఆస్త‌మాని కంట్రోల్‌లో ఉంచుకుంటే క‌రోనా బారిన ప‌డ‌కుండా కూడా ఉంటారు. అవేంటంటే..

లావెండర్ ఆయిల్

వేడి నీటిలో ఆరు చుక్క‌ల లావెండ‌ర్ న‌నె వేసి క‌లుపాలి. దీన్ని ప‌ది నిమిషాల పాటు ఆవిరి ప‌ట్టుకుంటే అస్త‌మా నుంచి ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది. ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. లావెండర్ ఆయిల్ వాయుమార్గాల వాపును నిరోధిస్తుంది. ఇది శ్లేష్మం ఉత్పత్తిని నియంత్రిస్తుందని తేలింది. లావెండ‌ర్ ఆయిల్ గాలి మార్గాలకు ఉపశమనాన్నిస్తుంది. అంతేకాదు లావెండ‌ర్ ఆయిల్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

తేనె

కొంచెం నీటిలో ఒక టీస్పూన్ తేనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తాగాలి. ఇలా రోజుకు ఒక‌సారి తాగాలి. దీంతోపాటు రాత్రి ప‌డుకునే ముందు తేనె, దాల్చిన‌చెక్క క‌లిపిన నీటిని కూడా తాగితే బెట‌ర్‌. ఇది గొంతు నుంచి కఫాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు బాగా నిద్రపోవడానికి అనుమతిస్తుంది.

పసుపు

ఒక గ్లాస్ వాట‌ర్‌లో పావు టీస్పూన్ ప‌సుపు వేసి క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు మూడుసార్లు  చొప్పున 14 రోజులు పాటిస్తే అస్త‌మా నుంచి విముక్తి పొందుతారు. పసుపు కూడా ఒక అద్భుతమైన యాంటీమైక్రోబయల్ ఏజెంట్‌. ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగించే యాడ్-ఆన్ థెరపీగా ఈ ఫైటోకెమికల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

కాఫీ

ఉబ్బసం నుంచి ఉపశమనం పొందడానికి తక్షణ నివారణగా వేడి కాఫీని తాగాలి. ఉబ్బసానికి చికిత్స‌గా కాఫీ తాగడం సులభమైన మార్గం. ఎందుకంటే ఇది వెంటనే వాయుమార్గాలను సులభతరం చేస్తుంది. శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. కాఫీలోని కెఫిన్ బ్రోంకోడైలేటర్‌గా పనిచేస్తుంది.

విటమిన్లు

ప్రతిరోజూ ఈ విటమిన్ సప్లిమెంట్లలో ఒక టాబ్లెట్ తీసుకోవాలి. ఈ సప్లిమెంట్లను ఒక నెలపాటు కొనసాగించాలి. ఇంకా ఆస్త‌మాలో మార్పు రాక‌పోతే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. విటమిన్ డి అస్తమా లక్షణాలను తగ్గించడానికి మెరుగ్గా ప‌నిచేస్తుంది. 

అల్లం

ఒక క‌ప్పు వేడి నీటిలో టీస్పూన్ అల్లం తురుము వేసి బాగా క‌లుపాలి. దీన్ని ఏడు నిమిషాలపాటు వేడి చేయాలి. త‌ర్వాత నీటిని వ‌డ‌క‌ట్టి తేనె వేసి క‌లుపాలి. మిశ్ర‌మం చ‌ల్లార‌క ముందే తాగితే తాగాలి. అల్లం టీని రోజుకు మూడు క‌ప్పులు తాగితే మంచిది. శ్వాసకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం భేష్‌గా ప‌నిచేస్తుంది. అల్లం వాయుమార్గ కండరాలను సడలించి, క్యాల్షియం తీసుకోవ‌డాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల ఉబ్బసం నుండి ఉపశమనం లభిస్తుంది 

వెల్లుల్లి

అర క‌ప్పు పాల‌లో 10 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఉడ‌క‌బెట్టాలి. త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని తాగాలి. ఇలా రోజుకు ఒక‌సారి తాగాలి. వెల్లుల్లి ఊపిరితిత్తుల‌ను శుభ్ర‌ప‌రుస్తుంది. ఉబ్బసం లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలిగించే ఇంగ్రీడియంట్ వెల్లుల్లి.


logo