ట‌మాటాల‌ను ఎక్కువ‌గా తింటే.. లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ట‌..!


Fri,March 8, 2019 02:54 PM

ట‌మాటాల‌ను నిత్యం ఆహారంలో ఎక్కువ‌గా తీసుకుంటే.. లివ‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని, లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తెలిసింది. ట‌మాటాల్లో లైకోపీన్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే లైకోపీన్ శాతం ఎక్కువ‌గా ఉండే ట‌మాటా పౌడ‌ర్‌ను సైంటిస్టులు ఎలుక‌ల‌కు తినిపించారు. దీంతో వాటిల్లో క్యాన్స‌ర్ క‌ణాల వృద్ధి త‌గ్గింద‌ని, బాక్టీరియా పెరుగుద‌ల న‌శించింద‌ని సైంటిస్టులు గుర్తించారు. దీంతో వారు చెబుతున్న‌దేమిటంటే.. ట‌మాటాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే లైకోపీన్ క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటుంద‌ని, లివ‌ర్ క్యాన్స‌ర్ రాకుండా చేస్తుంద‌ని, అలాగే లివ‌ర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగు ప‌రుస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే లైకోపీన్ వ‌ల్ల డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయ‌ని వారు అంటున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. త‌మ ఆహారంలో ట‌మాటాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే పైన చెప్పిన విధంగా ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

4023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles