పచ్చి ఉల్లిపాయను రోజూ తింటే..?


Sat,December 15, 2018 02:17 PM

నిత్యం మనం వండుకునే కూరల్లో ఉల్లిపాయ కచ్చితంగా ఉండాల్సిందే. ఇది లేకుండా ఏ కూర, వంట పూర్తి కాదు. చాలా మంది ఉల్లిపాయలను పచ్చిగానే తింటుంటారు. అయితే ఎలా తిన్నప్పటికీ ఉల్లిపాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన లాభాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయను తింటుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొవ్వు తగ్గించుకోవాలంటే నిత్యం ఒక పచ్చి ఉల్లిపాయను తినాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.

2. ఉల్లిపాయల్లో క్రోమియం అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పచ్చి ఉల్లిపాయను నిత్యం తింటే డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చు.

3. ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ సీజన్‌లో వచ్చే శ్వాస కోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

4. ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి1, బి6, విటమిన్ కె, బయోటిన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటితో శరీరానికి కావల్సిన పోషణ లభిస్తుంది.

5. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, ఆస్తమా, వికారం, డయేరియా సమస్యల నుంచి బయట పడాలంటే.. పచ్చి ఉల్లిపాయలను తినాలి. చర్మ సంరక్షణకు కూడా ఉల్లిపాయ పనికొస్తుంది. చర్మంపై ఉల్లిపాయ రసం రాస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. పగలకుండా ఉంటుంది.

11740

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles