బొప్పాయితో మానసిక ఆందోళ‌న దూరం..!


Sat,November 24, 2018 07:19 PM

చిన్న చిన్న విషయాలకు ఆవేదన చెందే మనస్తత్వం ఉన్నవారు రోజూ బొప్పాయి తీసుకుంటే వారి మానసిక ఆందోళన తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయిలో ఎక్కువగా ఉండే పొటాషియం మానసికశక్తిని పెంచుతుంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది. బొప్పాయి ఎక్కువగా తింటే మనసుకీ, శరీరానికీ కూడా హాయినిస్తుంది. రక్తప్రసరణలో వచ్చే లోపాలను ఇది నివారిస్తుంది. తక్కువ క్యాల‌రీలు, ఎక్కువ ఫైబర్‌ ఉండే బొప్పాయిని తరచుగా తింటే కంటి చూపు బాగుంటుంది. చెవిలో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ తగ్గుతాయి. జీర్ణశక్తి వేగవంతం కావడంతో పాటు మలబద్ధకం సమస్య తొల‌గిపోతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రోజూ బొప్పాయి తింటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే బొప్పాయి వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి చిన్నచిన్న అనారోగ్య సమస్యలను కూడా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

10375

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles