పుట్టగొడుగులతో మధుమేహం దూరం..!


Tue,August 21, 2018 12:05 PM

పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చని పలువురు సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. పుట్టగొడుగులు ప్రీ బయోటిక్‌గా పనిచేస్తాయి. అంటే.. జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాకు సహకారం అందించి వాటిని శక్తివంతం చేస్తాయి. దీని వల్ల లివర్ గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్‌లో ప్రచురించారు.

సైంటిస్టులు చెబుతున్న ప్రకారం నిత్యం పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. పుట్టగొడుగుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. అలాగే ఇవి తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న జాబితాకు చెందుతాయి. అంటే.. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు త్వరగా పెరగవు. నెమ్మదిగా పెరుగుతాయి. ఎందుకంటే కార్బొహైడ్రేట్లు పుట్టగొడుగుల్లో తక్కువగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి పుట్టగొడుగులను చక్కని ఆహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా అధిక బరువును తగ్గించడంలోనూ పుట్టగొడుగులు పనిచేస్తాయి.

2354

More News

VIRAL NEWS