పుట్ట‌గొడుగుల‌తో హైబీపీ, కొలెస్ట్రాల్‌కు చెక్‌..!


Sun,November 18, 2018 07:48 PM

హైబీపీతో బాధ‌ప‌డుతున్నారా ? కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా ? అయితే.. పుట్ట‌గొడుగులు తినండి. క‌నీసం వారానికి రెండు నుంచి నాలుగు సార్లు పుట్ట‌గొడుగుల‌ను తీసుకుంటే ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. పుట్ట‌గొడుగుల ద్వారా మ‌న‌కు విట‌మిన్ డి బాగా ల‌భిస్తుంది. అలాగే వాటిల్లో ఉండే లెంటిసైన్‌, ఎరిట‌డెనిన్ అనే పోష‌కాలు ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

అలాగే హైబీపీ కూడా త‌గ్గుతుంది. ఇక పుట్ట‌గొడుగులను తిన‌డం వ‌ల్ల ఇవే కాకుండా మ‌హిళ‌ల్లో వ‌చ్చే బ్రెస్ట్ క్యాన్స‌ర్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ట‌. అలాగే మోకాళ్ల నొప్పుల‌కు పుట్ట‌గొడుగులు అమోఘంగా పనిచేస్తాయ‌ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక పుట్ట‌గొడుగుల‌ను ఆహారంలో భాగం చేసుకుని త‌ర‌చూ తింటుంటే పైన చెప్పిన లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

4060

More News

VIRAL NEWS