రోజూ పప్పు తింటే.. కొవ్వు క‌రుగుతుంద‌ట‌..!


Sat,March 23, 2019 05:38 PM

ఆ ప‌ప్పు దినుసులే క‌దా.. ఏం తింటాంలే.. అని మ‌న‌లో చాలా మంది అనుకుంటుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి ఏ ప‌ప్పు చేసినా అస్స‌లు న‌చ్చ‌దు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే.. మీరు ఇక‌పై ప‌ప్పు అంటే అమితమైన ఇష్టంగా తింటారు. అవును.. ఎందుకంటే.. ప‌ప్పు దినుసుల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయట‌. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంద‌ట‌.

నిత్యం ప‌ప్పు దినుసుల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో ఉండే కొవ్వును క‌రిగించుకోవ‌చ్చ‌ని.. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. ప‌ప్పు దినుసుల వ‌ల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు క‌రుగుతుంద‌ట‌. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. క‌నుక ప‌ప్పు దినుసుల‌ను క‌చ్చితంగా రోజూ తినాల్సిందేన‌ని వైద్యులు కూడా చెబుతున్నారు..!

4847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles