పిల్లల్లో ఆస్తమాకు చేపలతో చెక్..!


Mon,November 5, 2018 02:45 PM

పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు చేపలతో చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ఓ అధ్యయనాన్ని సైంటిస్టులు ప్రచురించారు. ఆస్తమాతో బాధపడుతున్న పలువురు చిన్నారులకు ఆరు నెలల పాటు చేపలతో కూడిన ఆహారాన్ని నిరంతరాయంగా ఇచ్చారు. అనంతరం తెలిసిందేమిటంటే... చేపలను తరచూ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆస్తమా తగ్గుతుందని సైంటిస్టులు తేల్చారు.

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో చేపలను వారంలో కనీసం రెండు సార్లు తింటే ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీని వల్ల ఆస్తమా కంట్రోల్‌లో ఉంటుందని అంటున్నారు అలాగే చేపలను తినడం వల్ల ఇతర శ్వాస కోశ వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.

1307

More News

VIRAL NEWS