చేపలతో ఆస్తమాకు చెక్..!

Wed,March 20, 2019 02:46 PM


మెల్‌బోర్న్: చికెన్, మటన్ కన్నా సులువుగా జీర్ణమయ్యే ఆహారం చేపమాంసం. హృద్రోగ సమస్యలున్న వారు చేప మాంసం తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే చేపమాంసం తినడం వల్ల ఆస్తమా (తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి)కు కూడా చెక్ పెట్టొచ్చంటున్నాయి తాజాగా జరిపిన అధ్యయనాలు. ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సౌతాఫ్రికాలోని ఓ గ్రామానికి చెందిన 600 మందిపై పరిశోధన చేయగా..ఈ విషయం వెల్లడైంది.


యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆండ్రియాస్ లొపాటా ఈ అంశంపై మాట్ల్లాడుతూ..ఆస్తమా వ్యాధిగ్రస్తుల సంఖ్య గత 30 ఏళ్లలో దాదాపు రెట్టింపు అయింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మందులతో ఆస్తమా రోగులకు ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. మెడిసిన్ రహిత చికిత్సలో భాగంగా పరిశోధన చేశాం. సముద్ర జీవులైన చేపలు, ఇతర జీవ ఉత్పత్తుల్లో ఉండే నూనెల ద్వారా లభించే ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పుఫా)తీసుకున్నవారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 62 శాతం వరకు తగ్గినట్లు గుర్తించాం. వెజిటేబుల్స్ ద్వారా లభించే ఎన్-6 పాలీసాచురేటెడ్ ఆయిల్స్ తీసుకున్నవారిలో ఆస్తమా సంబంధిత సమస్యలు 67 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తూ..వాటినే ఎక్కువ మొత్తంలో ఆహారంగా తీసుకుంటున్న గ్రామ ప్రజలపై ఈ పరిశోధన చేసినట్లు ఆండ్రియాస్ లొపాటా చెప్పారు.

2373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles