బుధవారం 05 ఆగస్టు 2020
Health - Aug 01, 2020 , 20:01:10

క్యారెట్‌ను ఇలా‌ తింటే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ మ‌టుమాయం!

క్యారెట్‌ను ఇలా‌ తింటే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ మ‌టుమాయం!

ఈ రోజుల్లో చాలామంది అందం కోసం క్యారెట్‌ తింటున్నారు. క్యారెట్ ర‌క్తాన్ని మెరుగుప‌రిచేందుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కూర‌ల్లో వాడే క్యారెట్‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. మ‌రి అవేంటో ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం. 

* ముందుగా క్యారెట్‌ను శుభ్రంగా క‌డ‌గాలి. ప్ర‌తిరోజూ వీటిని తిన‌డం వ‌ల్ల నులిపురుగు లాంటి స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. అంతేకాదు ర‌క్తం కూడా శుభ్ర‌ప‌డుతుంది. 

* రాత్రి నిద్ర‌పోయే ముందు క్యారెట్ ర‌సం తాగితే మంచిది. అయితే ఇందులో కొన్ని పాలు, కొంచెం తేనె వేసి దీంతోపాటు బాదం ప‌ప్పులు వేసుకొని తాగితే ఎంతో ఉప‌శ‌మ‌నాన్నిస్తుంది. రోజంతా ప‌నిచేసి అల‌సిపోయిన వారికి ఎన‌ర్జీనిస్తుంది. దీనివ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గ‌డంతోపాటు ఆలోచ‌నా విధంగా కూడా మంచి మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు.  

* విట‌మిన్ ఎ వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. క్యారెట్ ఎలో ఇది పుష్క‌లంగా ల‌భిస్తుంది. అందుకే ప్ర‌తిరోజూ ఒక క్యారెట్ తింటే కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. 

* ఈ రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. వీరు హాస్పిట‌ల్స్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోవాల్సిందే కాని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోలేక‌పోతున్నారు. ఇలాంటి వారు మెడిసిన్స్‌తో పాటు క్యారెట్‌ను తిన‌డం వ‌ల్ల‌ మ‌ళ్లీ రాళ్లు ఏర్ప‌డ‌కుండా అడ్డుకుంటుంది. 

 


logo