నిత్యం గుప్పెడు ప‌ల్లీలు తింటే.. హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌..!


Thu,February 21, 2019 12:51 PM

ప‌ల్లీల‌తో మ‌నం అనేక రకాల వంట‌ల‌ను చేసుకుంటుంటాం. కొంద‌రు ప‌ల్లీల‌తో ప‌చ్చ‌డి, ఫ్రైలు చేసుకుని తింటారు. కొంద‌రు వీటితో ర‌క ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఆర‌గిస్తారు. అయితే కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్యాన్ని అందించ‌డంలోనూ ప‌ల్లీలు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా.. ప‌ల్లీల‌ను నిత్యం గుప్పెడు మోతాదులో తింటుంటే హార్ట్ ఎటాక్ లు రావ‌ని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది.

నిత్యం 30 గ్రాముల మోతాదులో ప‌ల్లీల‌ను తీసుకుంటే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు, సైంటిస్టులు చెబుతున్నారు. ప‌ల్లీల్లో ఉండే మాంగ‌నీస్‌, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. మెద‌డు చురుగ్గా మారుతుంది. ఒత్తిడి త‌గ్గుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు కూడా రావ‌ని, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా నిత్యం ప‌ల్లీల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు.

6985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles