హాయిగా నిద్రపోవాలంటే ఇవి తినండి

హైదరాబాద్ : రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. అర్థరాత్రి అయ్యాక కూడా అటూ ఇటూ దొర్లుతూ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నారా. ఈ సమస్య ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. నిద్రలేమి కారణంగా ఒత్తిడి, చికాకు, కోపం లాంటి వాటికి కూడా గురవుతున్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. అయితే హాయిగా నిద్రపోవాలంటే రాత్రుళ్లు కొన్ని ఆహార పదార్థాలు తింటే మంచిదని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దిక్సా బవ్సర్ చెబుతున్నారు. అవేంటంటే..
1. పాలు
ఆవు లేదా గేదె పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే హాయిగా నిద్రపోవాలంటే పడుకునే ముందు వీటిని వేడి చేసి గ్లాసెడు పాలలో, చిటికెడు పసుపు వేసుకుని తాగితే మంచిది.
2. నట్స్
బాదం, పిస్టా, వాల్నట్స్ లాంటివి రాత్రి వేళలో తినడం వల్ల త్వరగా నిద్రపడుతుంది.
3. అన్నం
కడుపు నిండా అన్నం తినడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చని మన పూర్వీకుల నుంచి మనం గ్రహించవచ్చు. కాబట్టి నిద్రపట్టని వారు రాత్రి పూట అన్నం తింటే మంచి ఫలితం వస్తుంది.
4. చమ్మోలీ టీ
చమ్మోలీ టీ అనేది మనసులోని ఒత్తిడిని దూరం చేసేందుకు మంచి ఔషధం లాంటిది. ఇది తాగడం వల్ల ఒత్తిడి నుంచి దూరమై ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
5. చెర్రీస్
చెర్రీస్ తినడం వల్ల హార్మోన్లు రిలాక్స్ అయి, ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఫలితంగా మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.
తాజావార్తలు
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకదార్లకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు