మలబద్దకం పోవాలా..? ఈ పండ్లను తినండి..!


Thu,September 6, 2018 06:52 PM

ఆహారం తినే విషయంలో సమయ పాలన పాటించకపోవడం, అతిగా తినడం, ఊబకాయం, డీహైడ్రేషన్, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్.. ఇలా అనేక కారణాల వల్ల అనేక మందిని మలబద్దకం సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్ మందులను వాడాల్సిన పనిలేదు. పలు పండ్లను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలు. మలబద్దక సమస్య ఉండదు. మరి మలబద్దకాన్ని పోగొట్టే ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కివీ
ఈ పండ్లలో ఆక్టినిడైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పేగుల్లోని కదలికలను నియంత్రిస్తుంది. అందువల్ల పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. ఫలితంగా మలబద్దకం పోతుంది. నిత్యం ఈ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.

2. యాపిల్స్
యాపిల్ పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. నిత్యం యాపిల్ పండ్లను తింటున్నా జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. నారింజ
ఈ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణసమస్యలను పోగొడతాయి. నారింజ పండ్లను నిత్యం తింటే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

4. అంజీర్
నిత్యం ఆహారంలో అంజీర్ పండ్లను తింటుంటే జీర్ణ సమస్యలు పోతాయి. పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. మలబద్దకం పోతుంది.

5. అరటి పండ్లు
అరటి పండ్లు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని నిత్యం తింటుంటే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తదితర జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

11401

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles