ఈ పండ్లు రోజూ తింటే.. బ‌రువు త‌గ్గ‌డం ఖాయం..!


Thu,December 7, 2017 04:02 PM

నేటి త‌రుణంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, వేళకు భోజనం చేయడం ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇవే కాకుండా బరువు తగ్గాలని కచ్చితంగా నిర్ణయించుకున్న వారు మాత్రం ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించడం అవసరమే. కింద పేర్కొన్న పండ్లు అధిక బరువును తగ్గించేందుకు దోహదపడడంతోపాటు శరీరానికి కావల్సిన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తాయి. వాటి గురించిన వివరాలు మీ కోసం...

1. యాపిల్


యాపిల్స్‌లో క్యాలరీలు తక్కువగా, పీచు అధికంగా ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పెక్టిన్ కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా త్వరగా ఆకలి వేయదు. అదేవిధంగా మన శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లను ఇది పుష్కలంగా అందిస్తుంది. 100 గ్రాముల యాపిల్ తింటే దాదాపు 1500 మిల్లీగ్రాముల విటమిన్ సి అందుతుంది. ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

2. బెరీ


సంవత్సరం మొత్తం మీద కేవలం ఒకే సీజన్‌లో ఈ బెరీ పండ్లు మనకు లభ్యమవుతాయి. ఇందులో కూడా క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రతి రోజూ ఏదైనా పూట భోజనానికి ముందు ఒక బెరీ పండును తీసుకుంటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

3. అరటి పండు


అరటిపండులో నీరు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. మలబద్దకాన్ని ఇది నివారిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉండే అరటిపండ్లలో ఫ్యాట్ కరిగే ప్రాసెస్‌ను వేగవంతం చేసే పోషకాలు ఉంటాయి. అరటిపండు ఒకటి తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. అప్పుడప్పుడు అరటిపండ్లు తిని నీరు తాగడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది.

4. బ్లూబెర్రీలు


వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. రోజూ 100 గ్రాముల మోతాదులో బ్లూబెర్రీలను తీసుకుంటే ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు.

5. స్ట్రాబెర్రీలు


బ్లూబెర్రీస్‌లాగే ఇవి కూడా ఫ్యాట్‌ను తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వీటిలో అధికంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు ఆకలిని తగ్గిస్తాయి. శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తూనే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. కొవ్వును కరిగించేందుకు దోహదపడతాయి.

6. కివీ


కివీ పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. తక్కువ క్యాలరీలను ఇవి ఇస్తాయి. విటమిన్ సి ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. నారింజ పండ్లలో కంటే వీటి లోనే విటమిన్ సి రెండు రెట్లు అధికంగా ఉంటుంది. రోజుకు ఒక కివీ పండును తింటే కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, మలబద్దకాన్ని నివారించే గుణం వీటికి ఉంది. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌లు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఈ పండు దివ్య ఔషధంగా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కడుపు నిండిన భావనను ఈ పండ్లు కలగజేస్తాయి. బరువును తగ్గిస్తాయి.

7. గ్రేప్ ప్రూట్


దాదాపు అన్ని రకాల విటమిన్స్‌తోపాటు మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి. బరువు తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణలోనూ ఈ పండు మెరుగ్గా పనిచేస్తుంది.

8. టమాటలు


విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ టమాటల్లో పుషల్కంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో లభిస్తాయి. వీటిలోని లైకోపీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టమాటా జ్యూస్‌ను నిత్యం తీసుకుంటే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

9. లెమన్ జ్యూస్


నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. స్లిమ్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఎసిడిటీ వంటి అనారోగ్యాలను దూరం చేస్తుంది. భోజనం చేసిన తరువాత నిమ్మరసం తాగడం శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ యాసిడ్ శరీర బరువు పెరగనీయకుండా చేస్తుంది. నిమ్మరసం, తేనెల మిశ్రమం మహిళల బరువు తగ్గించేందుకు అద్బుతంగా పనిచేస్తుంది. కొవ్వు కణాలతో పోరాడగలిగే శక్తి నిమ్మకు ఉంది. ఇది ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.

10. అవకాడో


వయస్సు మీద పడుతున్నప్పటికీ శరీరాన్ని ఇంకా యవ్వనంగానే ఉంచేందుకు ఇవి దోహదపడతాయి. వీటిలో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. శరీరానికి ఇవి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. వీటిల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సంరక్షణకు ఉపయోగపడితే, విటమిన్ సీ, ఈలు వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. దీంతోపాటు అధిక బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు.

7766

More News

VIRAL NEWS