ఆక‌లిని పెంచే ఆహారాలు..!


Sat,July 7, 2018 08:55 PM

ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఆకలి లేకపోవడం కూడా ఒకటి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మెడిసిన్లను ఎక్కువగా వాడడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందిలో ఆకలి నశిస్తోంది. దీనికి తోడు కొందరిలో ఆకలి ఉంటుంది కానీ ఏమీ తినాలని అనిపించదు. అయితే ఎవరైనా కింద సూచించిన పలు పదార్థాలను తీసుకుంటే దాంతో ఆకలిని పెంచుకోవచ్చు. ఫలితంగా ఆహారం చక్కగా తినాలనిపిస్తుంది. మరి ఆకలి పెరగాలంటే మనం తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. నిమ్మ‌ర‌సం జీర్ణక్రియకు ఇది చాలా మంచి చేస్తుంది. శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఆకలి మందగించిన వారు గ్లాస్ నీటిలో కాస్త నిమ్మరసం పిండి అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకోవాలి. దీంతో ఆకలి బాగా పెరుగుతుంది.

2. ఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. లేదంటే వీటి నుంచి తీసిన రసాన్ని కూడా తాగవచ్చు.

3. వికారం, అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు అల్లం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ప్రతి రోజూ సన్నగా కట్ చేసిన కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి పెరుగుతుంది.

4. దాల్చిన చెక్క‌ను పొడి చేసి అందులో కొద్దిగా చక్కెర, సరిపడినంత తేనె కలిపి రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆకలి బాగా పెరుగుతుంది.

5. మెంతుల‌ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని గ్యాస్ ఇట్టే బయటకు వెళ్తుంది. దాంతో ఆకలి పెరుగుతుంది. ప్రతి రోజూ ఉదయం కొద్దిగా మెంతిపొడిలో తేనె కలిపి తీసుకోవడం మంచిది. పెరుగులో కలిపి కూడా తినొచ్చు. ఆకలి పెరుగుతుంది.

6. ద్రాక్ష పండ్లలో సి విటమిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయం చేస్తుంది. భోజనం చేశాక ద్రాక్ష పండ్లను తింటే జీర్ణం బాగా అవుతుంది. ఆకలి బాగా వేస్తుంది.

8587

More News

VIRAL NEWS