కీటో డైట్ పాటిస్తున్నారా..? ఈ ఆహారాలను తినండి..!


Thu,November 8, 2018 11:01 AM

నేటి తరుణంలో బరువు తగ్గాలనుకునే చాలా మంది కీటో డైట్ పాటిస్తున్నారు. అంతేకాదు, డయాబెటిస్, థైరాయిడ్, పీసీవోడీ సమస్యలు తదితర అనేక అనారోగ్య సమస్యలకు కీటో డైట్ ఉపయోగంగా ఉంటుందని తెలియడంతో అనేక మంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారాలను చాలా తక్కువగా, ఫ్యాట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారాలను ఎక్కువగా తినాలి. ఈ క్రమంలోనే కింద సూచించిన ఆహారాలను కీటో డైట్‌లో భాగం చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

1. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కీటోడైట్‌లో ఉన్న వారు చేపలను ఎక్కువగా తినాలి. నిత్యం కనీసం 85 గ్రాముల చేపలను తింటే ఫలితం ఉంటుంది. చేపల ద్వారా మనకు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కూడా లభిస్తాయి.

2. క్యాప్సికం, పుట్టగొడుగులు, కాలిఫ్లవర్, క్యాబేజీ, బ్రొకొలి, పాలకూర వంటి కూరగాయలను కూడా కీటో డైట్‌లో ఉన్నవారు తినవచ్చు. వీటిలో మన శరీరానికి కావల్సిన పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, కె వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి.

3. కీటో డైట్‌లో ఉన్నవారు రెగ్యులర్‌గా చికెన్ తినాలి. దీని వల్ల ప్రోటీన్లు, ఫ్యాట్లు మనకు సమృద్ధిగా లభిస్తాయి.

4. కీటోడైట్ పాటించే వారు అవకాడోలను కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. వీటిల్లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫ్యాట్లు, పొటాషియం, మినరల్స్ మనకు లభిస్తాయి.

5. కోడిగుడ్లను అత్యుత్తమ కీటోజెనిక్ డైట్‌గా చెప్పవచ్చు. వీటిల్లో కార్బొహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని పెంచుతాయి. మెదడు యాక్టివ్‌గా ఉండేలా చూస్తాయి.

6. ఆలివ్ ఆయిల్, రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు తదితర ఆహారాలను కూడా కీటోడైట్‌లో ఉన్నవారు తీసుకోవచ్చు. అయితే ప్రాసెస్ చేయబడిన మాంసాహారం, చీజ్, పెరుగు, తీపిగా ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్, బ్రెడ్, అన్నం తదితర కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను మాత్రం కీటోడైట్‌లో ఉన్నవారు మానేయాలి.

2832

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles