వెయిట్‌లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నారా..? ఈ నట్స్ తినండి..!


Thu,March 1, 2018 11:34 AM

నేటి తరుణంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి అధిక బరువు. స్థూలకాయం అని కూడా దీన్ని అంటారు. ఎలా పిలిచినా అధిక బరువు నుంచి బయట పడాలంటే వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవడం కూడా తప్పనిసరి అయింది. అయితే బరువు తగ్గే ప్రోగ్రామ్‌లో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని సతమతం అవుతుంటారు. అది కూడా ముఖ్యంగా స్నాక్స్ విషయంలో. భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి వేస్తే ఏం తినాలో అర్థం కాదు. అలాంటప్పుడు వారు కింద సూచించిన నట్స్‌ను తీసుకుంటే దాంతో బరువు తగ్గే ప్రోగ్రామ్‌కు ఎలాంటి ఆటంకం రాదు. పైగా బరువు తగ్గేందుకు ఈ నట్స్ తోడ్పడుతాయి కూడా. మరి ఆ నట్స్ ఏమిటంటే...

1. బాదం పప్పు


వీటిలో మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి. బాదంపప్పులో ఉండే ప్రోటీన్లు కండరాలను దృఢంగా చేస్తాయి. వీటిలో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు మన శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తాయి. కనుక రోజూ స్నాక్స్ రూపంలో బాదంపప్పును తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.

2. వాల్ నట్స్


వీటిల్లో మాంగనీస్, కాపర్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించేందుకు దోహదపడతాయి. అలాగే వాల్ నట్స్‌లో ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపులను తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తక్కువ చేస్తుంది. దీంతో శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. బరువు తగ్గవచ్చు. అదేవిధంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు కూడా వాల్ నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. కనుక ఇవి బరువును కంట్రోల్ చేస్తాయి.

3. పల్లీలు


సాధారణంగా వీటిని తింటే బరువు పెరుగుతారని అంటారు. కానీ అందులో నిజం లేదు. నిజానికి ఇవి బరువును పెంచవు. తగ్గిస్తాయి. నిత్యం తగిన మోతాదులో పల్లీలను తింటే వాటిల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్ మన శరీరానికి అందుతాయి. దీంతో ఎంత సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. కనుక వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నవారు పల్లీలను రోజూ స్నాక్స్ రూపంలో తినవచ్చు.

4. పిస్తా పప్పు


వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఈ నట్స్‌ను కొన్ని తిన్నా చాలు, దాంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గుతారు. అలాగే పిస్తాలో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. బరువు తగ్గుతారు.

5. హేజల్ నట్స్


వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.

4417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles