ఈ 3 పండ్లు తింటే.. మలబద్దకం, అజీర్ణం అసలే ఉండవు..!


Wed,December 12, 2018 06:56 PM

మలబద్దకం, విరేచనం సరిగ్గా జరగకపోవడం.. ఈ రెండు సమస్యలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. మెట్రో నగరాల్లో నివసించే 100 మందిలో 22 మంది అనారోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని కలిగి ఉన్నారని తెలిసింది. ఇలాంటి వారే ఎక్కువగా అజీర్ణం, మలబద్దకం బారిన పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఈ సమస్యలకు ఏం చేయాలో తెలియక చాలా మంది అవస్థలు పడుతున్నారు. అలాంటి వారు కింద సూచించిన పండ్లను నిత్యం తింటే దాంతో జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. మరి ఆ పండ్లు ఏమిటంటే...

1. ద్రాక్ష


ద్రాక్షల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల ద్రాక్షను తింటే 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. పైబర్ వల్ల పేగుల్లో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. అలాగే తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం పోతుంది. ద్రాక్షలను నిత్యం తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

2. నారింజ


నారింజ పండ్లలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నారింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే వాటిల్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే నారింజెనిన్ అనే పదార్థం లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. అంటే.. విరేచనం సాఫీగా అయ్యేందుకు తోడ్పడుతుందన్నమాట. కనుక నారింజను నిత్యం తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

3. జామ


జామ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని పోగొడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. జామ ఆకులను తిన్నా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి డయేరియాను తగ్గిస్తాయి.

13105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles