డార్క్ చాక్లెట్ గుండెకు మంచిది!


Wed,September 13, 2017 05:09 PM

గుండె ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్స్ మేలు చేస్తాయ‌ని నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు. ఈ చాక్లెట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంద‌న్న విష‌యాలను న్యూట్రిష‌న్ ఎక్స్‌ప‌ర్ట్ సోనియా నారంగ్‌, న్యూట్రిష‌నిస్ట్ మెహర్ రాజ్‌పుత్ వెల్ల‌డించారు.

- డార్క్ చాక్లెట్‌లో ఫైబ‌ర్‌, ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఒలిక్‌, స్టియ‌రిక్‌, పాల్మిటిక్ యాసిడ్లు కూడా ఉంటాయి.
- ర‌క్త‌పోటును నియంత్రించ‌గ‌ల‌దు. ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగు ప‌రుస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో సాయ‌ప‌డుతుంది.
- డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లావ‌నోల్స్ వ‌ల్ల గుండెకు, మెద‌డుకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగవుతుంది. క్యాన్స‌ర్ ముప్పును కూడా త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుంది.
- డ‌యాబెటిస్‌తోపాటు వివిధ గుండె సంబంధిత‌ వ్యాధుల‌కు కార‌ణ‌మ‌య్యే ఇన్సులిన్ నిరోధ‌క స్థాయిని త‌గ్గిస్తుంది.

3199

More News

VIRAL NEWS