శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 27, 2020 , 20:05:16

హార్మోన్ ఇంబాలెన్సా..? అయితే ఇలా చేయండి

హార్మోన్ ఇంబాలెన్సా..? అయితే ఇలా చేయండి

మనం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, డైట్ ఫాలో అయితే చాలు అనుకుంటారు. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి హార్మోన్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒక్కసారి శరీరంలోని హార్మోన్లలో మార్పులు వచ్చాయంటే, మీరు శారీరకంగా వివిధ రకాలుగా బాధపడాల్సి వస్తుంది. అలాంటిప్పుడు హార్మోనులు బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా ?

ఒత్తిడితో కూడిన జీవన శైలి మరియు తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్మోన్లు మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి జీవప్రక్రియ, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్‌ల వల్లనే కలుగుతాయి. హార్మోనులు ప్రభావం టీనేజర్ లో మొటిమలు, అకస్మిక మార్పులు, శారీరక మార్పులు, మూడ్ స్వింగ్స్ మొదలగు మార్పులు జరుగుతాయి.

శరీరంలో హార్మోన్లు అసమతుల్యతను మెయింటైన్ చేయడానికి, హెల్తీ ఫ్యాట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. హెల్తీ ఫ్యాట్స్ అంటే మీరు రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, రియల్ బట్టర్, చేపలు, పీనట్ బట్టర్ వంటివి తీసుకోవడం మంచిది. బ్రొకోలీ, కాలీఫ్లవర్, మరియు క్యాబేజ్ శరీరంలో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తాయి. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రౌస్ తీసుకోవాలి. పచ్చి బఠానీలు, సోయాబీన్స్ అప్పుడప్పుడు తినాలి. ఆకుపచ్చ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ జాతి పండ్లు, బెర్రీలు, గ్రేప్స్ తింటుండాలి. హార్మోన్ అసమతుల్యతను దూరం చేయడంలో క్యారట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

కాఫీ తక్కువగా తీసుకోవాలి. షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి బట్టర్ మింట్స్ వాడటం ఉత్తమం. గుడ్డులోని పచ్చసొన తినాలి. రోజుకు సరిపడా నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎనిమల్ లివర్ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. మెటబాలిక్ హైడ్రేషన్ కోసం 8 గ్లాసులకు తక్కువ కాకుండా మంచినీరు తాగాలి. జీవిత భాగస్వామిని కౌగిలించుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్లు స్రవించి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. 


logo