బుధవారం 12 ఆగస్టు 2020
Health - Jul 11, 2020 , 17:33:43

వేకువనే ప్రొటీన్ తో చక్కెర కంట్రోల్

వేకువనే ప్రొటీన్ తో చక్కెర కంట్రోల్

తెల్లవారు జామున ప్రొటీన్ డయట్ తీసుకుంటే రక్తంలో చక్కెర అదుపులో ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. బాత్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 15 మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులపై ఈ అధ్యయనం జరిపారు. (వారిలో ఎనిమిది మంది స్త్రీలు, ఏడుగురు పురుషులు) ఈ అధ్యయనంలో పాల్గొన్నవారికి ఉదయం నాలుగు గంటలకు వెయ్ ప్రొటీన్ తో కూడిన 300 మి.లీ. నీటిని ఇచ్చారు. ఆ నీటిని తాగి వారు మళ్లీ నిద్రపోయారు. నిద్రలేచిన తర్వాత పిండి పదార్థాలతో కూడిన మామూలు అల్పాహారం ఇచ్చారు. తర్వాత రెండు గంటలకు చెక్ చేస్తే వారి రక్తంలో చక్కెర స్థాయి చాలాతక్కువగా ఉన్నట్టు తేలింది. వెయ్ ప్రొటీన్ కాకుండా మరో రకం ప్రొటీన్ ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలియదు.  మధుమేహులపై ఈ పరీక్షలు జరిపి చూడాల్సి ఉంది. చక్కెర స్థాయిని ఈ విధానం తగ్గించగలిగితే రాత్రివేళ ఏదో జాములో ప్రొటీన్ డ్రింక్ లేదా మరోటి తీసుకుంటే చక్కెర అదుపులోకి వస్తే మంచిదే కదా. 


logo