ఆదివారం 24 జనవరి 2021
Health - Nov 06, 2020 , 17:13:24

డ్రైఫ్రూట్స్‌.. ఆరోగ్యానికి బెస్ట్‌..

డ్రైఫ్రూట్స్‌.. ఆరోగ్యానికి బెస్ట్‌..

ఎండుఫలాలు లేదా డ్రైఫ్రూట్స్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని ఎనర్జీ ఫుడ్‌గా పిలుస్తారు. సూపర్‌మార్కెట్లలోనేకాక చిన్న చిన్న దుకాణాల్లో కూడా దొరుకుతాయి. వీటి ధరకాస్త ఎక్కువే అయినా.. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. వీటి పోషక విలువలు తెలిసినవారు వాటిని రెగ్యులర్‌ డైట్‌లో తప్పక చేర్చుకుంటారు. వీటిలో పీచుపదార్థం, శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. అందుకే ఫిట్‌నెస్‌ నిపుణులు వీటిని వ్యాయామం ముందు సత్తువ అందించడానికి సిఫారసు చేస్తారు. ఒంట్లో శక్తిలేనప్పుడు 5,6 డ్రై ఫ్రూట్స్‌ తింటే చాలు తక్షణ శక్తి వస్తుంది. 

ప్రయోజనాలివే..

 • హెల్తీ డ్రై ఫ్రూట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. రక్తనాళాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. హిమోగ్లోబిన్‌ పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
 • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
 • మలబద్దకం లాంటి సమస్యలను నివారిస్తుంది. 
 • అజీర్తిని నివారించే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. 
 • కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది.
 • ఇందులో ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. 
 • ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించేందుకు అద్భుతంగా సహాయపడుతాయి.
 • డ్రైఫ్రూట్స్‌లో క్యాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎముకల బలానికి చాలా సహాయపడతాయి.
 • దంతక్షయం నుంచి కాపాడుతాయి. చిగుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 • డ్రై ఫ్రూట్స్‌లో ఉండే న్యూట్రిషినల్ యాసిడ్స్ రక్తంలో బ్లడ్ ప్రెజర్‌, శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించేందుకు సహాయపడుతాయి.
 • జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి.
 • వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను నివారిస్తాయి. 
 • డ్రైఫ్రూట్స్‌లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి సహాయపడుతాయి.
 • బాదం, పిస్తా, అంజీర్‌, ఖర్జూర, గుమ్మడి, దోస విత్తనాలు, ద్రాక్షలాంటి పండ్లు ఆయా సీజన్‌లో తప్ప వేరే కాలాల్లో దొరకవు. అందుకే వాటిని డ్రైఫ్రూట్స్‌రూపంలో తీసుకుంటాం. రోజూ నాలుగు లేదా ఐదు డ్రైఫ్రూట్స్‌ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo