రోజూ వైన్ తాగితే బ‌రువు త‌గ్గుతారా ? ఇందులో నిజ‌మెంత ?


Thu,January 3, 2019 03:14 PM

నిత్యం ప‌రిమిత మోతాదులో వైన్ తాగితే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని, బ‌రువు త‌గ్గ‌వ‌చ్చని చెబుతుంటారు. వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయ‌ని, అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని, క‌నుక రోజూ త‌గిన మోతాదులో వైన్ తాగితే ఆరోగ్య‌క‌ర లాభాలు ఉంటాయ‌ని కూడా వైద్యులు చెబుతుంటారు. అలాగే వైన్ తాగడం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని కూడా వారు అంటుంటారు. అయితే అస‌లు ఇందులో నిజ‌మెంత ? అంటే.. ఈ విష‌యాన్ని తేల్చ‌డానికే హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు. వారు మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న 19,220 మంది మ‌హిళ‌ల‌ను 12.9 సంవ‌త్స‌రాల పాటు ప‌రిశీలించారు. వారిలో కొంద‌రు రెడ్ వైన్ తాగేవారు ఉండ‌గా, కొంద‌రు వైట్ వైన్ తాగేవారు, కొందరు ఆల్క‌హాల్ తీసుకోని వారు ఉన్నారు. ఈ క్ర‌మంలో చివ‌రికి తేలిందేమిటంటే... రెడ్ వైన్ తాగిన వారు బ‌రువు పెర‌గ్గా, వైట్ వైన్ తాగిన వారు బ‌రువు తగ్గిన‌ట్లు గుర్తించారు. ఇక ఆల్క‌హాల్ తీసుకోని వారు బ‌రువు పెరిగే అవ‌కాశం 43 శాతం వ‌ర‌కు ఉంటుందని తేల్చ‌గా, వైన్ తాగిన వారు బ‌రువు పెరిగే అవ‌కాశం 33 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని నిర్దారించారు. అందువ‌ల్ల నిత్యం త‌గిన మోతాదులో వైట్ వైన్ తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, రెడ్ వైన్ తాగితే బ‌రువు పెరుగుతారని సైంటిస్టులు చెబుతున్నారు.


4473

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles