బుధవారం 20 జనవరి 2021
Health - Dec 01, 2020 , 16:48:03

రాగి చెంబులో నీళ్లు మంచివని ఎందుకంటారు..

రాగి చెంబులో నీళ్లు మంచివని ఎందుకంటారు..

హైద‌రాబాద్ : మనిషి శరీరం దాదాపు 70 శాతం వరకు నీటితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రాణం నిలబెట్టుకోవాలంటే నీళ్లు చాలా ముఖ్యమైనవి. మీకు తెలుసా.. మన పూర్వీకులు నీళ్లను రాగి బిందెల్లో పోసుకుని.. రాగి చెంబుతో తాగేవారు. నిజానికి ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వారి నమ్మకం. ఆయుర్వేదం ప్రకారం.. రాగి అనేది మనిషి శరీరానికి అవసరమయే మినరల్స్ లో ముఖ్యమైనది. రాగి బిందెలో, రాగి చెంబులో స్టోర్ చేసుకున్న నీటిని తాగడం వల్ల మన శీరరంలోని మూడు రకాల దోషాలు పోతాయట. అవేంటంటే.. వట, కఫ, పిట్ట‌. అంటే.. రాగి వస్తువులు నీటిని వాటికవే ఫ్యూరిఫై చేసి మనకు శుభ్రమైన నీటిని అందిస్తాయట. 

రాగి బిందె/చెంబు/బాటిల్ లో ఉంచిన నీటిని రోజుకి 2 లేదా 3 గ్లాసులు తాగితే మన శరీరానికి సరిపడే కాపర్ అందుతుంది. నిజానికి రాగి బెందెలు, రాగి చెంబుల పద్ధతి చూసే ప్రస్తుతం ఆర్ఓ ప్యూరిఫైర్స్, వాటర్ ఫిల్టర్స్ లాంటి వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే.. రాగి బిందె/చెంబులో నీటిని ఉంచడం వల్ల అది..  నీటిలోని హానికరమైన సూక్ష్మజీవులు, అచ్చులు, శిలీంధ్రాలు, ఆల్గే, బ్యాక్టీరియా వంటి వాటిని చంపి మనకు మంచి నీటిని అందిస్తుంది. దీంతో పాటు రాగిలో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తులు ఉంటాయి. అందుకనే.. రాత్రంతా లేదా నాలుగు గంటల పాటు రాగిబిందెలో నిల్వ ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. రాగి చెంబులో నీరు తాగడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాం..

1. అరుగుదల బాగుంటుంది

రాగి వస్తువుల్లో స్టోర్ చేసిన నీరు హానికరమైన బ్యాక్టీరియాను చంపి.. కడపులో మంటను తగ్గిస్తుంది. కాబట్టి ఇవి అరుగుదలను పెంచడంతో పాటు అల్సర్, ఇన్ ఫెక్షన్ లాంటి వాటిని తగ్గిస్తాయి. రాగి శరీరాన్ని శుభ్రపరిచి, డిటాక్స్ చేస్తుంది.  

2. బరువు తగ్గచ్చు

కాపర్ శరీరంలో కొవ్వును తగ్గించి.. బరువు పెరగకుండా కాపాడుతుంది.

3. య‌వ్వ‌నంగా ఉంటారు

చాలా ఏళ్ల నుంచి రాగిని సహజంగా చర్మంపై వచ్చే గీతలన్ని, ముడతల్ని తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. దీంట్లోని యాంటీ-ఆక్సిడెంట్లు, కొత్త కణాలను పుట్టించేందుకు సహాయపడతాయి.  

4. గుండె పదిలంగా ఉంటుంది

రాగి చెంబులో నీరు గుండె జబ్బులకు దూరంగా ఉంచడంతో పాటు.. బీపీని, గుండె చప్పుడును అదుపులో ఉంచుతుంది, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

5. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి 

రాగిలోని యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడి.. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.


logo