గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jun 07, 2020 , 22:40:19

గోరు వెచ్చని నీరు తాగితే ఎన్నో లాభాలు

గోరు వెచ్చని నీరు తాగితే ఎన్నో లాభాలు

ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకుంటే చాలు. ఆ ఆహారమే ఓషదమై మనలోని ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతోంది. ఇంట్లో తయారు చేసే కొన్ని ఔషదాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. అందులో ఒకటి గోరువెచ్చని నీరు. ఇందులో తేనె, మిర్యాలపొడి కలుపుకొని తాగితే మనలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తేనె, మిర్యాలపొడిలో యాంటీబయాటిక్‌ లక్షనాలుంటాయి. వీటిని గోరువెచ్చని నీటీలో కలుపుకొని తాగితే కరోనా వంటి సమస్య కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయట. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తేనె, వేయించిన వాము కలిపి తాగితే అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. మనలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, తాజాగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి.

తాజావార్తలు


logo