వేడి నీటిని ఇలా తాగితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు..!


Sun,October 14, 2018 04:36 PM

వేడి నీటిని రోజూ తాగితే ఎంతో మేలు కలుగుతుందని, పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. వేడి నీటిని తాగడం వల్ల మధుమేహం రాకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉండవు. అలాగే జీర్ణ సమస్యలు కూడా నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని రోజూ తాగడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయట. జలుబు, దగ్గు రావట. అలాగే వేడి నీటిని తాగడం వల్ల బరువు పెరగరట. బరువు తగ్గుతారట.
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా రెండు, మూడు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. ఆ తరువాత బ్రేక్‌ఫాస్ట్‌కు 30 నిమిషాల ముందు ఓ గ్లాస్ వేడి నీటిని తాగాలి. రాత్రి భోజనం చేసిన తరువాత, నిద్రించే ముందు ఒక్కో గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతోపాటు శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల శరీరం చురుగ్గా కూడా ఉంటుంది.

12477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles