రోజూ గ్రీన్ టీ తాగితే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చ‌ట‌..!


Sun,March 17, 2019 11:58 AM

గ్రీన్ టీ తాగితే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే చాలా మందికి.. గ్రీన్ టీ తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారా ? అనే ఒక సందేహం ఉంటుంది. అయితే ఆ సందేహానికి ఇక చెక్ ప‌డిన‌ట్లే. ఎందుకంటే గ్రీన్ టీ తాగితే అధిక బ‌రువు త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది.

ఓహియో స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఇటీవ‌లే ఎలుక‌లపై ఒక ప‌రిశోధ‌న చేశారు. గ్రీన్ టీ పౌడ‌ర్‌ను 8 వారాల పాటు కొన్ని ఎలుక‌ల‌కు ఇచ్చారు. దీంతో వాటిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గింద‌ట‌. అలాగే బ‌రువు కూడా త‌గ్గాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల వారు చెబుతున్న‌దేమిటంటే.. గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఒబెసిటీ రాకుండా ఉంటుంద‌ని, వ‌చ్చినా గ్రీన్ టీ తాగితే బ‌రువు త‌గ్గుతార‌ని, అలాగే జీర్ణాశ‌యంలో వాపులు త‌గ్గుతాయ‌ని, డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. క‌నుక ఎవ‌రైనా స‌రే.. నిత్యం గ్రీన్ టీని తాగుతుంటే అధిక బ‌రువును క‌చ్చితంగా త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ముందు చెప్పిన ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి..!

3897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles