పరగడుపునే అల్లం టీతో అధిక బరువుకు చెక్..!


Tue,September 18, 2018 03:03 PM

అధిక బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే ముఖ్యం కాదు. అధికంగా క్యాలరీలు ఉండే ఆహారాలను కూడా కట్ చేయాల్సిందే. వాటిని తినడం మానేస్తేనే అధిక బరువును తగ్గించుకునేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలు, శీతల పానీయాలు, కొవ్వు ఎక్కువగా ఉండే చిప్స్, నూనె పదార్థాలను అస్సలు తినకూడదు. అయితే వీటిని తీసుకోవడం మానేయడంతోపాటు నిత్యం ఉదయాన్నే పరగడుపునే అల్లంతో తయారు చేసిన టీని తాగితే అధిక బరువును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు.

ఒక పాత్రలో కొన్ని నీటిని తీసుకుని అందులో తురుం పట్టిన అల్లాన్ని కొంత వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు మరిగాక ఆ నీటిని వడబోయాలి. అనంతరం వచ్చే అల్లం టీని పరగడుపునే తాగేయాలి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే అల్లం టీలో నిమ్మరసం లేదా తేనెలను కలుపుకుని తాగితే ఇంకా మంచి ఫలితాలుంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ అల్లం టీ తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చని వారు చెబుతున్నారు.

3764

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles